నవతెలంగాణ – జన్నారం
అటవీ, వన్యప్రాణులను రక్షించే క్రమంలో ప్రాణాలు అర్పించిన అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జన్నారం ఎఫ్డివో రామ్మోహన్ అన్నారు. జాతీయ అటవీ అమర వీరుల దినోత్సవం సందర్భంగా గురువారం జన్నారం అటవీశాఖ డివిజన్ కార్యాలయంలో తాళ్లపేట రేంజ్ కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అటవీ, వన్యప్రాణులను రక్షించే క్రమంలో ప్రాణాలు అర్పించిన అటవి సిబ్బంది చిత్రపటాలకు పూలమాలలు వేసి, మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అడవులను వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. 2013 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనీ కాండ్వా జిల్లాలో నీ నేర్వాన్ వద్ద ఇబ్బంది వీరమరణం పొందిన సంఘటనను గుర్తు చేసుకోవడానికి ఈరోజును ఎంపిక చేశారు అన్నారు. అటవీ అమరవీరులను, వారి త్యాగాలను గుర్తించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.ఆర్వో సుష్మరావు, సెక్షన్ ఆఫీసర్లు,బీట్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
అమరవీరుల త్యాగాలు మరువలేనివి: ఎఫ్డివో రామ్మోహన్
- Advertisement -
- Advertisement -