నవతెలంగాణ – జుక్కల్
గత మూడు నెలలుగా ప్రభుత్వం తమకు వేతనాలు ఇవ్వడం లేదని మండల పరిషత్ లో విధులు నిర్వహిస్తున్న ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పంచాయతీ రాష్ట్ర యూనియన్ నిర్ణయం ఆదేశాల మేరకు విధులను బహిష్కరిస్తామని ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాముకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వినతిపత్రంలో ఈ పంచాయతీ సీఓలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తమను అడ్డగోలుగా తమ పరిధిలో లేని పని చేయించుకుని, తమకు రావాల్సిన వేతనాలను గత మూడు నెలలుగా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని తెలిపారు. తమ కుటుంబాలను పోషించుకోవాలంటే ఆర్థికంగా తమకు వచ్చే వేతనాలను సకాలంలో విడుదల చేయాలని అన్నారు. కుటుంబ పోషణ గడవ లేక తాము మరోపని వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఇక తాము ఇక విధులు నిర్వహించలేమని, నేటి నుండి వీధులను బహిష్కరిస్తామని ఎంపీడీవో కు సమాచారం కొరకు వినతిపత్రం అందించమన్నారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లు వాణి , ప్రవీణ్ , భూమా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ పంచాయతీ ఆపరేటర్ల వేతనాలు వెంటనే విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES