- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
79 వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని గురువారం ఒకే అధికారిని నాలుగు చోట్ల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మండలంలోని తొర్రూరు, శాతాపురం, దుబ్బ తండా ఎస్పీ గ్రామాలకు ప్రత్యేక అధికారినిగా ఉన్న ఆర్డబ్ల్యూఎస్ డిఈ సంధ్య పాలకుర్తిలో గల మిషన్ భగీరథ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పది గంటల నుండి 10 30 నిమిషాల వరకు తొర్రూరు, శాతాపురం, దుబ్బ తండా ఎస్పీ గ్రామపంచాయతీలో త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు త్రివర్ణ పతాకాలు ఆవిష్కరించే అవకాశం కల్పించకుండానే మండల కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయం తో పాటు ప్రత్యేక అధికారిగా ఉన్న గ్రామాల్లో త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు.
- Advertisement -