ప్రజా ప్రతినిధులు జేల్లా భరత్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడుటకు సహాయం అందించాలి
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ముదిరాజ్ వీధిలో జేల్లా భరత్ ఆనారోగ్య పరిస్థితి చూసి చలించిపోయిన నిజామాబాద్ (ఇందూర్) సర్వసమాజ్ కమిటీ కో. కన్వీనర్ అండ్ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ కుమార్ వారికీ రెండు నెలలకూ సరిపడా బియ్యం, పప్పులు, కారం, పసుపు, నూనె, చక్కెర ఇంకా ఇతర నిత్యావసర సరుకులు శుక్రవారం అందించడంతో పాటు కొంత మొత్తం నగదును అందించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చారు.
ఈ సందర్బంగా నిజామాబాద్ (ఇందూర్) సర్వసమాజ్ కమిటీ కో. కన్వీనర్ అండ్ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ పెద్దలు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మహామ్మద్ షబ్బీర్ అలీ, జేల్లా భరత్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడుట కోరకు సహాయం చెయ్యడానికి ముందుకు రావాలని, వారి ఆరోగ్య పరిస్థితి కూదుటా పడటం కోసం సరియైన వైద్య సహాయం అందించడానికి సహాయ పడాలని కోరారు. అలాగే ఇక్కడి నిజామాబాద్ నగరం ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కూడా వారికీ తోచిన సహాయం వెనువెంటనే అందించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణా ఉద్యమకారులు ఈర్ల శేఖర్, జండా బాలాజీ గుడి డైరెక్టర్ వేముల దేవిదాస్, మాజీ కౌన్సిలర్ కోనేరు సాయి కుమార్, మోస్రా నారాయణ మరియు పెద్ద ఎత్తున అక్కడి మహిళలు పాల్గొన్నారు
జెల్ల భరత్ కుటుంబానికి సరుకులు అందించిన అదే ప్రవీణ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES