Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమళ్లీ అదే సీన్‌

మళ్లీ అదే సీన్‌

- Advertisement -

ఫోన్‌ ట్యాపింగ్‌పై నోరు మెదపని ప్రభాకర్‌రావు
రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్న సిట్‌ అధికారులు
14న తిరిగి విచారణకు రావాలని ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడై ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు బుధవారం రెండోసారి విచారణలో సైతం అనేక ప్రశ్నలకు మౌనం వహించినట్టు తెలిసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా సిట్‌ అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా డీఎస్పీ ప్రణీత్‌రావు ఇచ్చిన వాంగ్యూలానికి సంబంధించి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. మాదాపూర్‌లోని ఓ ప్రయివేట్‌ ఐటీ సంస్థతో ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంలో కీలకపాత్ర వహించారట గదా అనే ప్రశ్నకు తనకేమీ తెలియదని జావాబిచ్చినట్టు తెలిసింది. కొందరు కీలకమైన ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లను కూడా ఇదివరకు అరెస్టయిన నలుగురు అధికారుల ద్వారా ట్యాపింగ్‌ చేయించారు కదా అనే ప్రశ్నకు సైతం ఆయన మౌనం వహించినట్టు సమాచారం. మీ పర్యవేక్షణలో ఉండే ఎస్‌ఐబీ కార్యాలయంలో ప్రణీత్‌రావు ప్రత్యేకమైన ఫోన్‌ ట్యాపింగ్‌ యంత్రాలతో వార్‌రూం ఎలా ఏర్పాటు చేసుకున్నారని ప్రశ్నించగా పొంతన లేని సమాధానమిచ్చినట్టు తెలిసింది. నిషేధిత మావోయిస్టుల సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా ట్యాపింగ్‌ జరుగుతుంటుంది కదా అని ప్రభాకర్‌రావు ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌లకు ఆదేశించడం వెనకు బీఆర్‌ఎస్‌ సుప్రీం ఉన్నారనీ ఇదివరకు అధికారులు ఇచ్చిన సమాచారాన్ని ఆయన దృష్టికి తీసుకుపోగా అందుకు కూడా మౌనం వహించారట. ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఆయన ఉపయోగించిన రెండు సెల్‌ ఫోన్లను సిట్‌ అధికారులు స్వాధీన పర్చుకున్నారు. ఈ సారి కూడా దాదాపు 30కి పైగా ప్రశ్నలను ప్రభాకర్‌రావుపై సంధించిన అదికారులకు కొన్నింటికి మాత్రమే సమాధానాలు దొరికాయని తెలుస్తోంది. చట్టపరంగా తనకు ఇబ్బంది కాని ప్రశ్నలకే ఆయన స్పందించినట్టు సమాచారం. రెండోసారి విచారణను ముగించిన అధికారులు తిరిగి 14న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఈ విచారణలో పశ్చిమ మండల డీసీపీ విజయకుమార్‌ స్వీయ పర్యవేక్షణలో సిట్‌ ఏసీపీ వెంకటగితో పాటు మరో నలుగురు అధికారులు పాల్గొన్నారు. పూర్తి స్థాయి వీడియో పర్యవేక్షణలో ఆయనలో విచారించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad