నవతెలంగాణ – జుక్కల్
మంజూరైన ఇండ్లను త్వరితగతిన నిర్మాణాలు చేసుకోవాలని లబ్ధిదారులకు ఎంపీడీవో శ్రీనివాస్ సూచించారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని పలువురు లబ్ధిదారులు నిర్మాణాలు చేసుకుంటున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఒక్క లబ్ధిదాడు అర్హులైన వారికి ప్రభుత్వం గుర్తించి డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయడం జరుగుతుందని, అర్హులై ఉండి ఎవరికైనా మంజూరు కానీ ఎడల వారు నిర్భయంగా వచ్చి దరఖాస్తులను తమ సమస్యలను నేరగా వచ్చి ఎంపీడీవో కార్యాలయంలో తమకు విచారించాలని రాబోయే రోజులలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులు నిర్మాణాలు చేసుకునేందుకు పలువురికి ముగ్గు వేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు జుక్కల్ గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్ గల్కాట్ వార్ రాజు , లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
మంజూరైన ఇండ్లను త్వరితగతిన నిర్మాణాలు చేసుకోవాలి.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES