జాతీయ రహదారి కల్వర్టు నుండి ఇసుక తరలింపు..కుంగి పోనున్న బ్రిడ్జ్..
కూతవేటు దూరం లో కలెక్టరేట్..పట్టించుకోని అధికారులు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట పట్టణంలోని జాతీయ రహదారి 65 సర్వీస్ రోడ్డు క్రింద ఇరు వైపులా (కలెక్టర్ రోడ్డు సమీపంలో ) గల ఇసుక గుట్టు చప్పుడు కాకుండ రాత్రి అనక పగలు అనక ట్రాఫిక్ కు నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్లు పెట్టి కల్వర్టు సపోర్ట్ గా ఉన్న మెత్తటి ఇసుకని ట్రాక్టర్ల తో తీసుకొని పోతున్న ఇసుక మాఫియా దారులు ట్రాక్టర్లు అడ్డుపెట్టడంతో వాహన, పాద చారులకు ఇబ్బంది తో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. కల్వర్టు నుండి తీసిన ఇసుకను సర్వీస్ రోడ్డు మీద పోసి మరి డంపింగ్ చేస్తున్నారు. ఈ తతంగాన్ని చూస్తూ కూడా అటువైపు ఏ ఒక్క అధికారి కూడా పోయి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా రెవిన్యూ,మైనింగ్ అధికారులు కళ్ళు తెరచి ఇసుక మాఫియాను అడ్డుకొని వారిని కటకటాల పంపించాలని ఆ ప్రాంత ప్రజలు జిల్లా కలెక్టర్ ను వేడుకుంటున్నారు.గతంలో ఈ బ్రీడ్జి కుంగి పొతే మరల దానిని నిర్మాణం చేశాారని, అక్కడ స్థానిక ప్రజలు తెలుపుతున్నారు.
యధేశ్చగా ఇసుక మాఫియా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



