- Advertisement -
నవతెలంగాణ – మక్తల్
మండలంలోని మంథన్ గోడ్ గ్రామ సర్పంచ్ రాజేందర్ గౌడ్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే తన సొంత నిధులతో గ్రామానికి అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే రూ.8 లక్షలతో అంబులెన్స్ గురువారం రోజు కొనుగోలు చేశారు. అయితే వాహనంలో వైద్య పరికరాలు, ఇతరత్రా అమర్చి, ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబులెన్స్ వాహనాన్ని అధికారికంగా గ్రామపంచాయతీకి అందజేస్తానని తెలిపారు. కొనుగోలులో సర్పంచ్ రాజేందర్ గౌడ్ తో పాటు.. గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



