నవతెలంగాణ – జడ్చర్ల
మండలం క్రీష్టారం గ్రామం అంబటపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎనిమిదో వార్డ్ లో గల హనుమాన్ గుడికి తన సొంత నిధులతో స్లాబ్ వేయిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం ఉదయం స్లాబ్ వేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మాట్లాడుతూ.. సర్పంచ్ ఎలక్షన్లలో మాకు హనుమంతుడు తోడుగా ఉండి గెలిపించాడని అన్నారు. జీవితాంతం హనుమంతుడి సేవలో తమ వంతు సేవ ఉంటుందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కానీ పని ఆ హనుమంతుడు మా చేత చేయించుకోవడం అనేది నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని అన్నారు. హనుమంతుడికి స్లాబ్ వేయడంతో 8వ వార్డు సభ్యులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గత పాలకులు ఇచ్చిన మాట తప్పడమే కాకుండా అంబఠాపురం గ్రామాన్ని పట్టించుకోలేదు. సుజాతమ్మ గెలిచిన నెల రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మాకు అందరికీ సంతోషంగా ఉంది అన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న క్రీష్టారం సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



