Sunday, March 22, 2026
E-PAPER
Homeకరీంనగర్బస్సులో ప్రయాణించి ఆదర్శంగా నిలిచిన సర్పంచులు

బస్సులో ప్రయాణించి ఆదర్శంగా నిలిచిన సర్పంచులు

- Advertisement -

నవతెలంగాణ – వీర్నపల్లి : సాధారణంగా ప్రజాప్రతినిధులు అనగానే ఖరీదైన కార్లు, హంగూ ఆర్భాటాలు కనిపిస్తాయి. కానీ దానికి భిన్నంగా వీర్నపల్లి మండలం గర్జనపల్లి వన్‌పల్లి గ్రామాలకు చెందిన సర్పంచులు బుచ్చగారీ రాకేష్ గౌడ్, తాడగొండ సాయిలు సోమవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు.బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో సర్పంచులు సరదాగా ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, సామాన్యుడిలా వారితో కలిసిపోయారు.చాలా కాలంగా ప్రజాప్రతినిధులు సొంత వాహనాలకే పరిమితమవుతున్నారు. కానీ ఆర్టీసీ బస్సు ప్రయాణం అత్యంత సురక్షితం మరియు సౌకర్యవంతం” అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని, తద్వారా సంస్థను ఆదుకోవాలని వారు కోరారు.హోదాను పక్కన పెట్టి, ప్రజల మధ్యకు వచ్చి బస్సులో ప్రయాణించిన సర్పంచుల తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -