Friday, January 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి

స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి

- Advertisement -

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య
ట్యాంక్‌ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి నిరసన


నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నీల వెంకటేష్‌ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహం ఎదుట విద్యార్థులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు, 100 బీసీ కాలేజ్‌ హాస్టళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ కాలేజ్‌ హాస్టళ్లలో సీట్లు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు రాత్రివేళల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అనంతయ్య, సతీష్‌, రాందేవ్‌ మోదీ నిమ్మల వీరన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -