Saturday, May 24, 2025
Homeఖమ్మంరెండోరోజు కొనసాగిన  భూసేకరణ గ్రామసభలు… 

రెండోరోజు కొనసాగిన  భూసేకరణ గ్రామసభలు… 

- Advertisement -

– డీటీ రామక్రిష్ణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్,  7 వ, 8వ ప్యాకేజీల భూ సేకరణ కోసం భూసేకరణ స్పెషల్ అడిషనల్ కలెక్టర్ జే.కార్తీక్, పాల్వంచ యూనిట్ 1 ఉత్తర్వులు మేరకు అశ్వారావుపేట మండలంలో రెండో రోజు శుక్రవారం భూసేకరణ గ్రామసభలు నిర్వహించారు. ఉప తహశీల్దార్ రామక్రిష్ణ ఇచ్చిన సమాచారం మేరకు పీసా చట్టం సెక్షన్ 4,భూసేకరణ చట్టం 2013 సెక్షన్ 41 ఎల్.ఎ ప్రకారం మండలంలోని 15 పంచాయితీల్లో నీటిపారుదల  కాలువ నిర్మాణం చేపట్టడానికి 848.28 కుంటలు  భూసేకరణ చేయుట కొరకు 5 పంచాయితీల్లో గ్రామసభలు నిర్వహించారు. శుక్రవారం ఆసుపాక,వేదాంత పురం,తిరుమలకుంట,గుమ్మడి వల్లి,బచ్చువారిగూడెం లలో నిర్వహించిన గ్రామసభల్లో 388.09 ఎకరాలకు సంబంధించి న వివరాలను,సర్వే నెంబర్ లను గ్రామ సభలో ప్రకటించారు. ఈ గ్రామ సభలో స్పెషల్ కలెక్టర్ కార్తీక్,ఐబీ డీఈఈ ఎల్. క్రిష్ణ,ఏఈఈ కేఎన్బీ క్రిష్ణ,డీటీ లు భరణి బాబు, రామ క్రిష్ణ,ఆర్ఐ లు పద్మావతి,క్రిష్ణ,ఆయా పంచాయితీల కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -