–ప్రతిరోజు గ్రామ సందర్శన తప్పనిసరి
– కార్యదర్శులకు ప్రభుత్వం పలు కొత్త నిబంధనలు
నవతెలంగాణ-బెజ్జంకి
రాష్ట్ర సచివాలయానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలాంటివారో..గ్రామ సచివాలయానికి అక్కడి కార్యదర్శి అంతటివారు..అందుకే ఆయన ఇక తప్పనిసరిగా సంబంధిత పల్లెలోనే నివసించాలి. మెజారిటి కార్యదర్శులు పల్లెల్లో నివాసం ఉండకుండా పట్టణ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూండడంతో పరిపాలన పరమైన విషయాల్లో ప్రజలు ఇబ్బందులను ఎదురుకుంటున్నారు.పంచాయితీ రాజ్ ఉత్వర్వుల ప్రకారం కార్యదర్శులు పల్లెల్లోనే నివాసం ఏర్పుచుకుంటే గ్రామ అభివృద్దిలో వికాసం ఉంటుంది. పంచాయతీలో పన్నులను వసూలు చేయడం అతని ప్రధాన విధి.ఇలాంటి పలు కొత్త నిబంధనలు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అమలు చేసిన పంచాయతీరాజ్ చట్టంలో అమలులోకి వచ్చాయి.
ఈ నెల 22న గ్రామ పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. జిల్లాలో మొత్తం 508 గ్రామ పంచాయతీలకు ఇటీవలనే సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల్లో పూర్తయ్యాయి. గెలిచిన అభ్యర్థులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.గతంలో ఒక్కొక్క కార్యదర్శి నాలుగైదు గ్రామాలను చూడాల్సి రావడం వల్ల అతను ఎప్పుడు?ఎక్కడ? ఉంటారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉండేది.పంచాయితీ కార్యదర్శుల నోటిఫికేషన్‌కు ఉత్తర్వులు రావడంతో పెద్ద ఎత్తున్న ఉన్నత చదువులు చదివిన నిరుదోగ్యులు కార్యదర్శుల పోస్టులకు ఎంపికయ్యారు.కార్యదర్శుల నియమాకాన్ని పూర్తి చేసిన ఆనంతరం కొత్త కార్యదర్శులు గ్రామాల్లో సమస్యలతో పాటు పారిశుద్ద్యం,వీధిదీపాల నిర్వహణ,జనన,మరణ ధృవీకరణ పత్రాల జారీ వంటిపనులను చేపడుతున్నారు.గ్రామ పంచాయితీలలో ప్రతి పనికి కార్యదర్శి జవాబుదారి కావడంతో ఆయనపైన గ్రామ అభివృద్ది బాధ్యతలు ప్రధానంగా ఉండనున్నాయి.
కార్యదర్శి ముఖ్య విధులు ఇలా..
పంచాయతీ తీర్మానాలను కార్యదర్శి అమలు చేయాలి. గ్రామంలో రోజు ఉదయాన్ని పర్యటిస్తూ పారిశుద్ద్య సిబ్బంది హజరును తీసుకోని వారికి పనులు చూపించాలి.మురుగు కాలవల్లోని పూడికను తీయించాలి.చెత్తను తడి,పొడిగా డంపింగ్ యార్డుల వరకు తరలించేలా..వీధిదీపాలు 90 శాతం వెలిగేలా చూడాలి. తాగునీటి సరఫరాకు భగీరథ అధికారులకు సహకరించాలి.అతను పంచాయతీకి అధీనుడు (సబార్డినేట్)గా ఉంటారు.కార్యదర్శి కొత్త పన్నులను ప్రతిపాదించవచ్చు.విధుల్లో విఫలమైన కార్యదర్శి తన ఉద్యోగాన్ని కోల్పోక తప్పదు.గ్రామంలో మొక్కలను నాటడం,వాటిలో కనీసం 85 శాతం బతికేలా చర్యలు చేపట్టి వివరాల నమోదుకు రిజిస్ట్రర్‌ను నిర్వహించాలి.
ప్రతి రాబడి,ఖర్చును లెక్కల పుస్తకంలో నమోదు చేయాలి.సర్పంచి పర్యవేక్షణ,నియంత్రణ కింద పంచాయతీ సిబ్బందిపై పాలనాపరమైన,వారికి జీతాల చెల్లింపు అధికారాలు కార్యదర్శికి ఉంటాయి. కార్యదర్శి తాను నిర్వర్తించిన పనులపై ప్రతినెల నివేదికలను బహిర్గత పరచాలి.ఇందులో తప్పిదాలు బయటపడితే క్రమశిక్షణ చర్యలు తప్పవు. పంచాయతీ అనుమతించే ఏదైనా అనుమతి లేదా ఉత్తర్వును మరుసటి రోజే కార్యదర్శి జారీ చేయాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే ఉత్తర్వులను అమలు చేస్తుండాలి.నిబంధనలు పాటించని కార్యదర్శులపై కలెక్టర్లు చర్యలు తీసుకునే అవకాశాన్ని కల్పించారు.



