నవతెలంగాణ – కట్టంగూరు
లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ సేవలు అభినందనీయమని ప్రాథమిక వైద్యాధికారి శ్వేత అన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఏపీ సింగ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం 150 మంది రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వైద్యాధికారి శ్వేత మాట్లాడుతూ పేద ప్రజలకు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు లయన్స్ క్లబ్ ముందుండాలన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చిక్కు శేఖర్,ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, బసవోజు వినోద్ కుమార్ , రాపోలు వెంకటేశ్వర్లు, కడవేరు మల్లికార్జున్ , మంగదుడ్ల శ్రీనివాస్, గోషిక ఉమాపతి, నకిరేకంటి శంకర్, ఆకవరం బ్రహ్మచారి, బొడ్డుపల్లి వెంకన్న, జిల్లా ఉపేందర్ ఉన్నారు.
లయన్స్ క్లబ్ సేవ అభినందనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



