– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ చిన్నా రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారతదేశ స్వాతంత్ర సమరంలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చేసిన సేవలు అమూల్యమైనవని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని టోలిచౌకిలో తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ (మేవా) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మారక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరం దండి సత్యాగ్రహం నిర్వహించినప్పుడు అబుల్ కలాం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారని గుర్తు చేశారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణలు విద్యా విధానానికి ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. రిటైర్డ్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఎంజి అక్బర్ మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యా విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందించిన 65 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను ఉత్తమ సేవా అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి మేవా రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఫరూక్ హుస్సేన్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వహీద్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మౌజమ్ అలీ ఖాన్, రాష్ట్ర నాయకులు మహమ్మద్ జావిద్ అలీ, తఫియొద్దీన్, హిదాయత్ అలీ, ఆరిఫ్, అమీర్ పాష తదితరులు పాల్గొన్నారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు అమూల్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



