Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నరసింహాస్వామి సేవలు మరువలేనివి 

నరసింహాస్వామి సేవలు మరువలేనివి 

- Advertisement -

ఎంపీడీవో సుమన వాణి 
నవతెలంగాణ – తాడ్వాయి 
: వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ పదవీ విరమణ తప్పదని, తాడ్వాయి మండల ఎంపీడీవో కార్యాలయంలో సూపర్డెంట్ శనిగరం నరసింహా స్వామి సేవలు మరువలేనివని, ఎనలేని వని మండల అభివృద్ధి అధికారి సుమన వాణి అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూపర్డెంట్ శనిగరం నరసింహస్వామి అంకితభావంతో పనిచేస్తూ పలువురి మన్ననలను పొందారని అన్నారు.

గత 41 సంవత్సరాల నుండి విధులు సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. అనంతరం నరసింహ స్వామి దంపతులను ఘనంగా సన్మానించి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి జాల శ్రీధర్ రావు, మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు, మండల వ్యవసాయ శాఖ అధికారి కుమార్ యాదవ్, అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు, మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad