Wednesday, April 1, 2026
E-PAPER
HomeNewsవ్యాయామ ఉపాధ్యాయుడు మోహన్ సేవలు అమోఘం…

వ్యాయామ ఉపాధ్యాయుడు మోహన్ సేవలు అమోఘం…

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్

ఎడపల్లి పాఠశాలలో మార్చి నెలతో ఉద్యోగ విరమణ పొందిన ఎడపల్లి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పిడి ఎ.మోహన్ సన్మాన కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని మోహన్ విద్యారంగానికి చేసిన సేవలు ఎంతోమంది విద్యార్థులను క్రీడలలో రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లడాన్ని అభినందించారు.

బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ మోహన్ బిసిటియు సంఘానికి దాదాపు 15 సంవత్సరాలుగా జిల్లా అసోసియేటడ్ అధ్యక్షులుగా పనిచేయడమే కాకుండా సంఘ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎడపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్, బిసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవాపురం గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కొట్టాల రామకృష్ణ, సలహాదారులు రమణ స్వామి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -