Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారిశుధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయం

పారిశుధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయం

- Advertisement -

 నవతెలంగాణ కమ్మర్ పల్లి
గ్రామాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచడంలో నిత్యం శ్రమించే పారిశుధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయమనీ కమ్మర్ పల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ పేర్కొన్నారు.శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలనా-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక మాట్లాడుతూ సమాజంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులను సత్కరించడం ఆనందంగా ఉందని అన్నారు.గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజూ కష్టపడి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నిజమైన సేవకులని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, బుచ్చి మల్లయ్య, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -