Monday, May 12, 2025
Homeతెలంగాణ రౌండప్రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం..

రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సేవలందిస్తున్న తోట రాజశేఖర్ కు జాతీయ స్థాయిలో రెడ్ క్రాస్ అవార్డు వరించినందుకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్  రాజీవ్ గాంధీ హన్మంతు ఆయనను సోమవారం ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. రాజశేఖర్ సేవల గురించరని తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా నిరంతరంగా సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమంలో వేసవి కాలంలో తెసుకోవాల్సిన జాగ్రత్తలు పై రెడ్ క్రాస్ రూపొందించిన వడ దెబ్బ సూచనాపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రజలలో అవగాహన పెంచడంలో రెడ్ క్రాస్ చేస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు. అనంతరం కలెక్టర్  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ అందిస్తున్న సేవలను అభినందించారు. ప్రజలకు అత్యవసర సమయాల్లో రక్తం చేస్తున్న అనేక నిరంతర సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు పాలనాధికారులు  అంకిత్ ఐ.ఏ.ఎస్ , కిరణ్ కుమార్ , డి.ఆర్.డి.ఓ పి.డి సాయ గౌడ్ , ఏ.సి.పి రాజా వెంకట్ రెడ్డి , ఇంచార్జి ఆర్.డి.ఓ స్రవంతి , డి.పి.ఓ శ్రీనివాస్ రావు డి.ఎం.ఎచ్.ఓ రాజశ్రీ , టి.ఎం.జి.ఓ అధ్యక్షుడు సుమన్, సెక్రటేరి శేఖర్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు , కోశాధికారి కరిపే రవీందర్, జేే ఆర్ స డాక్టర్ అబ్బాపూర్ రవి, శ్రీనివాస్, మచ్చేందర్, హరికృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -