– వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య
– మార్కెట్ కమిటీ కార్యదర్శి మెర్సీ పదవీ విరమణ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి తన పదవీకాలంలో ప్రజలకు అందించిన అత్యుత్తమసేవలే పేరు ప్రతిష్టలు తీసుకువస్తాయని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. మంగళవారం మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి మెర్సీ సల్మాన్ రాజ్ పదవి విరమణ సందర్భంగా ఆత్మీయ వీడుకోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ పాలేపు నరసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమన్నారు. అయితే ఉద్యోగిగా తన పదవి కాలంలో ప్రజలకు అందించిన మంచి సేవలు ఆ ఉద్యోగికి భవిష్యత్తులో పేరు ప్రతిష్టలు తీసుకు వస్తాయన్నారు. మార్కెట్ కమిటీ కార్యదర్శిగా మెర్సీ అందించిన సేవలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా కార్యదర్శి మెర్సీ సల్మాన్ రాజ్ దంపతులకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆయన పాలకవర్గం తరపున శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి, మెమొంటో అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, డైరెక్టర్ లు మహిపాల్, లింగారెడ్డి, నవీద్, జీడి మధులత శ్రీనివాస్, జీవన్, ముత్తైన్న, సూపర్ వైజర్ రాజు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



