Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఆటలుమెరిసిన లెవాన్‌ అరోనియన్‌

మెరిసిన లెవాన్‌ అరోనియన్‌

- Advertisement -

గ్రాండ్‌ చెస్‌ టూర్‌
సెయింట్‌ లూయిస్‌ (యుఎస్‌ఏ) :
గ్రాండ్‌ చెస్‌ టూర్‌ సెయింట్‌ లూయిస్‌ (బ్లిట్జ్‌, ర్యాపిడ్‌) టోర్నమెంట్‌లో ప్రపంచ చెస్‌ చాంపియన్‌, భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 18 రౌండ్ల బ్లిట్జ్‌, మూడు రోజుల ఉత్కంఠభరిత ర్యాపిడ్‌ చెస్‌ పోటీల అనంతరం అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ లెవాన్‌ అరోనియన్‌ (24.5 పాయింట్లు) విజేతగా నిలిచాడు. ఆఖరు రోజు పోటీల్లో (9 బ్లిట్జ్‌ ఫార్మాట్‌) తొలి నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు ఓ డ్రా సాధించిన గుకేశ్‌.. ఆ తర్వాత ఏకాగ్రత కోల్పోయాడు. చివరి ఐదు రౌండ్లలో రెండు పరాజయాలు, మూడు డ్రాలతో నిరాశపరిచాడు. 18 పాయింట్లు సాధించిన గుకేశ్‌.. చైనా జీఎం లీమ్‌ లీతో సంయుక్తంగా ఆరో స్థానం పంచుకున్నాడు. అమెరికా జీఎం ఫాబియానో కారువాన 21.5 రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో నిలిచిన లెవాన్‌ రూ.34 లక్షల నగదు బహుమతి దక్కించుకోగా.. గుకేశ్‌ రూ.9 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad