Sunday, December 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'కొక్కోరొకో' షూటింగ్‌ పూర్తి

‘కొక్కోరొకో’ షూటింగ్‌ పూర్తి

- Advertisement -

యంగ్‌ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తూ దర్శకుడు రమేష్‌ వర్మ ఆర్‌.వి.ఫిల్మ్‌ హౌస్‌ను స్టార్ట్‌ చేసి నిర్మాతగా మారారు. అందులో భాగంగా శ్రీనివాస్‌ వసంతల అనే యంగ్‌ డైరెక్టర్‌ను పరిచయం చేస్తూ ‘కొక్కోరొకో’ అనే యాంథాలజీని రూపొందించారు. ఐదు విభిన్నమైన పాత్రల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్‌ డిఫరెంట్‌ పోస్టర్‌ ద్వారా అనౌన్స్‌ చేశారు. వినూత్న ఆలోచనలతో డైరెక్టర్‌ శ్రీనివాస్‌ వసంతల.. విజువల్‌ గ్రాండియర్‌గా, బలమైన ఎమోషన్స్‌ కలగలిపి ఈ సినిమాతో ప్రేక్షకులకు ఓ యూనిక్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతున్నారు.

రైటర్‌ జి.సత్యమూర్తి తనయుడు.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌ సోదరుడైన ప్లే బ్యాక్‌ సింగర్‌ జివి సాగర్‌ ఈ సినిమాకు డైలాగ్స్‌ రాశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని ఆకాశ్‌ ఆర్‌ జోషి, సంగీతాన్ని లండన్‌కు చెందిన ప్యాషనేట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంకీర్తన్‌ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రేఖా వర్మ, కురపాటి శిరీష నిర్మాతలు. నీలాద్రి ప్రొడక్షన్‌ సహ నిర్మాత. ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌. కొత్త టాలెంట్‌తో పాటు అనుభవం ఉన్న టీమ్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేన రమేష్‌ వర్మ అందించారు. కొత్తదనం కలిగిన యువ ప్రతిభతో పాటు అనుభవం ఉన్న టెక్నీషియన్ల సమ్మేళనంతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందనే ఆశాభావాన్ని మేకర్స్‌ వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -