హీరో ఫహాద్ ఫాజిల్ తన మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్‌ను ఆదివారం గ్రాండ్‌గా ఆరంభించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వేసిన సెట్‌కి ఆయన అభిమానులు భారీగా వచ్చారు. తన మీద అభిమానంతో వచ్చిన ఫ్యాన్స్‌ను చూసి ఫహాద్ హ్యాపీగా ఫీలయ్యారు. అభిమానుల సందోహం మధ్యే ఆయన తన షూటింగ్‌ని షురూ చేయటం విశేషం. అలాగే షూటింగ్ నుంచి కాసేపు విరామం తీసుకుని ఫహాద్ తన అభిమానుల్ని పలకరించారు. అభిమానుల ప్రేమ, ఉత్సాహాన్ని గుర్తించి అక్కడకు వచ్చిన వారితో హృదయపూర్వకంగా ముచ్చటించారు.
అర్కా మీడియావర్క్స్, షోయింగ్ బిజినెస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారతదేశం, ప్రపంచ వ్యాప్త సినీ అభిమానులు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న మహేష్‌బాబు ‘వారణాసి’ని కూడా కార్తికేయ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ ఫ్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలను మళ్లీ ఈ చిత్రం ఒకచోటకు చేర్చినట్టు అయింది. డైరెక్టర్ శశాంక్ యేలేటి ఈ మూవీని బలమైన భావోద్వేగ అంశాలు, కంటెంట్ బేస్డ్‌గా, ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారు. ఏప్రిల్ నాటికి షూటింగ్ పూర్తి అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. కాలా భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్దంలో విడుదల చేయబోతున్నారు.
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ మొదలైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



