Sunday, March 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే గ్యాస్‌ సిలిండర్ల కొరత

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే గ్యాస్‌ సిలిండర్ల కొరత

- Advertisement -

రేపు సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు:కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్లనే గ్యాస్‌ సిలిండర్ల కొరత ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా 16న మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇరాన్‌ తమపై దాడి చేయకుండా ముందస్తు దాడి చేస్తున్నామనే పొంతనలేని సాకుతో ఇజ్రాయిల్‌, ఇరాన్‌ నాయకత్వాన్ని మార్చాలని కుటిల నీతితో అమెరికా ఆ దేశంపై ఫిబ్రవరి 28న ఏకపక్షంగా బాంబుల వర్షం కురిపించిందని తెలిపారు.

పాఠశాలలపై క్షిపణి దాడుల చేసి 165 మంది విద్యార్థుల చావుకు కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్‌, డిజీల్‌, గ్యాస్‌ కొరత తీవ్రమైందని తెలిపారు. బ్యారెల్‌ ధర రూ.100 దాటిందనీ, ఫలితంగా దేశంలో గృహ అవసరాల గ్యాస్‌ ధరలు రూ.60కి పెరిగిందని పేర్కొన్నారు. పెట్రోల్‌, గ్యాస్‌ ధరలకు కొరత లేదని కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు అబద్ధమని తెలిపారు. గ్యాస్‌ సరఫరా తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఆస్పత్రులు మూతపడుతున్నాయని తెలిపారు. దీనికి మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోవడమే కారణమని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -