- Advertisement -
ఎమ్మార్సీస్ మండల అధ్యక్షుడు నరేశ్ మాదిగ
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ఇచ్చిన హామీలైన వృద్ధులకు,వితంతులకు,గీత,చేనేత బీడీ కార్మికులకు రూ.2 వేల నుంచి రూ.4వేలు,వికలాంగులకు రూ.4వేల నుంచి రూ.6 వెల వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్సీస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల 15న మండల కేంద్రమైన తాడిచెర్లలోని తహశీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని ఎమ్మార్సీస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్ మాదిగ శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో వృద్ధులు వితంతువులు గీత చేనేత బీడీ కార్మికులు వికలాంగులు వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -