Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeసమీక్షశిలలోని మౌన సంగీతం లహరి కవిత్వం

శిలలోని మౌన సంగీతం లహరి కవిత్వం

- Advertisement -

ప్రఖ్యాత కవయిత్రి శ్రీమతి ఎన్‌. లహరి గారి సజనాత్మకతకు ప్రతిరూపం ఈ ‘స్పర్శలేని శిల’ కవితా సంపుటి. మనిషి అంతర్ముఖ భావోద్వేగాలను, సమాజంలోని విరుద్ధాలను, జీవితపు విలువలను ప్రతిబింబించే అద్భుతమైన కవితా ధారగా ఈ కవితాసంకలనం నిలుస్తుంది. ఈ కవితల్లో కవి హదయం ఒక స్పర్శలేని శిలలా కనిపించినా, ఆ శిలలో దాగి ఉన్న సున్నితమైన అనుభూతులు, హదయ స్పందనలు పాఠకుడిని లోలోపల కదిలిస్తాయి. జీవన సంగ్రామాలు, మానవ సంబంధాల సౌందర్యం, బాధ, ఆనందం, ఆశ, నిరాశలు అన్నీ కవితలలో గాఢంగా ప్రతిఫలిస్తాయి. కవయిత్రి భావవ్యక్తీకరణ మాత్రం గాఢమైనది. ప్రతి కవిత ఒక హదయాన్ని తాకే అనుభవాన్ని అందిస్తుంది. కవిత్వం ద్వారా లహరి గారు సమాజంపై ఒక ప్రత్యేక దష్టిని, మానవత్వంపై మమకారాన్ని, ఆత్మాన్వేషణను పాఠకులకు అందిస్తున్నారు.ముఖ్యంగా, ఈ సంపుటి శీర్షిక ”స్పర్శలేని శిల” ఎంతో అర్థవంతమైంది. బయటి ప్రపంచానికి శిలలా కనిపించే మనసు, లోపల మాత్రం అపారమైన స్పందనల సముద్రాన్ని కలిగి ఉందని ఇది సూచిస్తుంది.

ఈ నేలను తడిమి చూడు/……….. కూలిన ఊళ్ల బురుజు శకలాలలో/ స్పష్టంగా కనిపిస్తాయి. అణచివేతలకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటాల గాధలును,చారిత్రక గాయాలకు ఒక సాక్ష్యంలాగా ఈ కవిత ప్రజా పోరాటాల గాథను, అన్యాయానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలను, చరిత్రలో రక్తం రాసిన అక్షరాలను మనసుకు హత్తుకునేలా ప్రతిబింబిపచేశారు.
పొద్దున్నే సూర్యుడిని/ చీపురుతో నిద్ర లేపుతుంది/ గడియారంతో పరిగెడుతూ…/ పరివారం కోసం పరితపిస్తుంది/ ………అమ్మమ్మ నాన్నమ్మ చిన్నమ్మ పెద్దమ్మ అత్తమ్మ ఎలా నాకు అమ్మలెందరున్నా…. ఆమెనే అమ్మ/ మా ఇంటిల్లపాదికి పట్టు గొమ్మ…” ఈ కవితలో అమ్మ గొప్పతనంను హదయానికి హత్తుకునేలా చిత్రించారు.ఇంట్లో ఎన్ని బంధాలు ఉన్న కుటుంబానికి ఆధారం, పునాది, పట్టుగొమ్మ మాత్రం అమ్మే అంటారు. చెమట చుక్కల నెత్తుటి సేద్యం/ రాలిన ఆకులం మూగ సాక్ష్యం/ మట్టి పరిమళాల మౌనరాగం/ మహికి దొరికిన పట్టణం/ నిత్యం సేద్యంతో యుద్ధం. రైతు చెమట చుక్కలతోనే పంటలను సాగు చేస్తాడు. పంటల పతనం, రాలిన ఆకులు అతని కష్టాలకు మౌన సాక్ష్యాలుగా నిలుస్తాయి. జీవితంలో గెలుపు వైపు పయనిస్తున్నప్పుడు ఎదురయ్యే కష్టాలు మన దిశను మార్చకూడదు. మనసు కంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. స్థైర్యం, పట్టుదలతోనే విజయాన్ని చేరుకోవచ్చు. నా దేశపు ఆకలి తీర్చడానికి/ అన్నం సష్టించే యంత్రన్నావుతాను/కురవని వర్షం కోసం/ అమ్మ చనుబాల కోసం/ ఏడ్చే పసిపిల్లవాడినవుతాను/ పట్టెడు అన్నం కోసం పాకులాడే/ నిరుపేద కడుపులకు/ ఆపన్న హస్తమవుతాడు.. ఈ దేశపు ఆకలి, పేదరికం, వర్షాభావం నివారణకు సహాయకుడిగా, మానవతా దక్పథంతో ప్రజల బాసటగా ఉండాలని కవయిత్రి లహరి సంకల్పిస్తుంది. తల్లిగా, చెల్లిగా, భార్యగా/ ఇప్పుడు ఒక స్త్రీగా కూడా/ సమాజం ముందు ఓడిపోతుంటే/ ఓ మనిషిగా మరణం వైపు బాధగా/ నడిచి వెళ్తున్నాను/ వేల వేల అశ్రుబిందులను రాల్చుకుంటూ/ అంతరాత్మను మనోజ్వాలతో కాల్చుకుంటూ/ నిత్యం దగ్ధమవుతున్న ఓ సగటు స్త్రీని… సమాజపు బంధనాల మధ్య నలిగిపోతున్న సాధారణ స్త్రీ యొక్క ఆవేదన, పోరాటం, వేదనతో కూడిన జీవన యాత్రను కవిత్వంతో తెలియజేశారు లహరి. ఆరిపోతున్న మా గుండె తలుపులో/ ఊపిరికి కాసింత చమురు పోస్తావేమోనని/ ఎదురుచూస్తున్న మీ అమ్మానాన్న.. తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం ఎదురుచూస్తూ, తమ మ్రగ్గిపోతున్న గుండెల్లో, ఊపిరికి కాస్త ఊరటనిచ్చే చినుకు ఆశిస్తూనారు. లహరి ‘స్పర్శ లేని శిల’ కవిత్వం మనసును లోని భావోద్వేగాలకు ప్రాణం పోసి తన కవిత్వం ద్వారా తెలుగు సాహిత్యానికి సరికొత్త స్పర్శని, తన శైలిలో ప్రతిపాదించారు. ఈ పుస్తకం మనసును స్పశించే, జీవితాన్ని మరింత విలువైనదిగా భావింపజేసే, ప్రతి తెలుగు పాఠకుడు చదవవలసిన కవిత్వం.

  • పూసపాటి వేదాద్రి, 9912197694
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad