నేడు మూడు గంటలకు హాజరు కావాలని ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా సోమవారం మాజీ ఎంపీ జి.సంతోశ్‌కుమార్‌కు నోటీసులను జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటి వరకూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావులను సిట్ ఏడు గంటల చొప్పున విచారించిన విషయం విదితమే. తాజాగా సంతోశ్‌కుమార్‌ను విచారణకు పిలవడంపై ఆసక్తి నెలకొంది. బీఆర్‌ఎస్ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా భావించే సంతోశ్‌కుమార్‌ను విచారణ జరిపి సిట్ తేల్చనున్న నిజాలేంటి అన్న అంశంపై అందరి దృష్టి నెలకొంది.
ముఖ్యంగా అనేక విషయాల్లో, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కేసీఆర్‌కు మధ్యవర్తిగా సంతోశ్‌కుమార్ వ్యవహరించేవారనీ, పార్టీకి సంబంధించిన నిధులను సమకూర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని సిట్ భావిస్తోందని తెలిసింది.బీఆర్‌ఎస్ హయాంలో చోటుచేసుకున్న కొన్ని వందల ఫోన్ల ట్యాపింగ్ విషయంలో సైతం సంతోశ్ కుమార్‌ను సిట్ ప్రశ్నించనున్నట్టు తెలిసింది. గతంలో అరెస్టయిన కొందరు పోలీసు అధికారులు సంతోశ్‌కుమార్‌కు సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించారనీ, వాటిపై కూడా సిట్ దృష్టి సారించే అవకాశముందని తెలిసింది. సంతోశ్ కుమార్ విచారణ అనంతరం మరింత కీలక పరిణామాలు ఈ కేసు దర్యాప్తులో చోటుచేసుకోవచ్చునని భావిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు సిట్ నోటీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


