సమరశీల మహిళా పోరాటాలు ఉధృతం కావాలి..
సామాజిక చైతన్యమే మన లక్ష్యం : ‘నవతెలంగాణ’తో ఐద్వా సీనియర్ నేత పుతుంబాక భారతి
ప్రస్తుతం దేశంలో సామజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని ఐద్వా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి వ్యాఖ్యానించారు. ఇవి మహిళా ఉద్యమానికి సైతం పెను సవాళ్లను విసురతున్నాయని ఆమె తెలిపారు. వీటన్నింటినీ తట్టుకుని సమరశీల పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. 89 ఏండ్ల వయసులో హైదరాబాద్‌లో జరుగుతున్న ఐద్వా అఖిల భారత మహాసభలకు హాజరైన భారతి.. ఆ వయసులోనూ నూతనోత్సాహంతో ‘నవతెలంగాణ’తో అనేక విషయాలను పంచుకున్నారు. తోటి ప్రతినిధులకు ఎంతో ఆదర్శంగా, స్ఫూర్తివంతంగా నిలిచిన ఆమెతో మాటామంతి ఇలా…
దూసుకెళుతున్న మహిళా లోకం…
నేటి మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే కుటుంబ పరంగా, సామాజికపరంగా అనేక ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొంటూ వారు జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది ఒకరకంగా వారికి కత్తి మీద సామే. అన్ని రకాల పరిస్థితులను బేరీజు వేసుకుంటూ, బ్యాలెన్సు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన స్థితి. అయినా పరిస్థితులను ఆకళింపు చేసుకుని సాగిపోవాల్సిందే.
కష్టం.. సంక్లిష్టం…
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ మహిళలు, మహిళా ఉద్యమాలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ధైర్యంగా నిలిచాయి. అయితే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ ప్రభావం వీటిపైనా పడిందని చెప్పకతప్పదు. రోజురోజుకూ శరవేగంగా పరిస్థితులు మారుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు మహిళలను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. వాటిని ఎదుర్కోవటం, పోరాటాలను ద్విగుణీకృతం చేయటం ఇప్పుడు ఎంతో కీలకం.
కుటుంబం.. సమాజం…
కుటుంబం, సమాజం ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగుంటాయి. ప్రతీ నిత్యం కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే మహిళలు సామాజిక బాధ్యతను కూడా భుజానికెత్తుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పాలకుల విధానాలు, ప్రపంచీకరణ పాలసీలు కుటుంబాలను సైతం చిన్నాభిన్నం చేస్తున్నాయి. తద్వారా మహిళలు తమ చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, అందులో తమ కుటుంబాన్ని చూసుకుంటూ…రెండింటినీ సమన్వయం చేయగల సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలి. ఇందుకోసం సామాజిక చైతన్యాన్ని పెంచుకోవాలి. వారు ఆ దిశలో పయనించే విధంగా మహిళా సంఘాలు అవగాహన పెంపొందించాలి.
పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



