ఆఫ్గన్ విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌తో ఘర్షణల నేపథ్యం లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఆఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్‌ఖాన్ ముత్తాకి ఆదివారం వెల్లడించారు. న్యూఢిల్లీలో ఆఫ్గనిస్తాన్ రాయబార కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముత్తాకి మాట్లాడారు. పాకిస్తాన్‌తో వివాదానికి శాంతియుత పరిష్కా రాన్నే ఆఫ్గనిస్తాన్ కోరుకుంటుందని, కానీ ఆ ప్రయత్నాలు విజయవంతం కాకపోతే వివాద పరిష్కారానికి వేరే మార్గాలు ఉన్నాయని ముత్తాకి పేర్కొన్నారు. ఈ నెల 9న ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఆదుపులోనే ఉందని ముత్తాకి తెలిపారు. పాకిస్తాన్ ప్రజలు, ప్రభుత్వంతో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని, కానీ ఆ దేశంలోని కొన్ని శక్తులు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ముత్తాకి తెలిపారు.