Monday, March 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలునవ్విస్తూ, భయపెట్టే 'రాకాస'

నవ్విస్తూ, భయపెట్టే ‘రాకాస’

- Advertisement -

నటి, నిర్మాత నిహారిక కొణిదెల మరో డిఫరెంట్‌ స్టోరీతో ఓ సినిమాని ఆడియెన్స్‌ ముందుకు తీసుకురానున్నారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో నిహారిక తన పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 3న రిలీజ్‌ చేయబోతున్నారు. తాజాగా మేకర్స్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ‘నరకం నుండి సందేశం వస్తుంది.. ఇక సమయం లేదు.. మన ఊరి శాపమిది.. మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత’ అంటూ ఊరిని, ఊరి జనాల్ని పరిచయం చేస్తూ వదిలిన టీజర్‌ అద్భుతంగా ఉంది. ‘శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.. ఈ రెండు లైన్సే వస్తున్నాయేంటి?’ అంటూ భయపడుతూ, నవ్విస్తూ హీరో పాత్రని పరిచయం చేశారు. హీరో పాత్ర ఎంట్రీ ఇచ్చిన తరువాత టీజర్‌ పూర్తిగా కామెడీ జోనర్‌లోకి మారి పోయింది.

ఇదే ఆఖరి హెచ్చరిక అంటూ మళ్లీ మరో కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లినట్టుగా అనిపిస్తుంది. ఆ తరువాత చూపించిన యాక్షన్‌ సీక్వెన్స్‌, విజువల్స్‌, ఆర్‌ఆర్‌ అన్నీ కూడా నెక్ట్స్‌ లెవెల్లో ఉన్నాయి. ఇక చివర్లో హీరో భయపడుతూ.. ‘స్త్రీ.. రేపు రా’ అనే డైలాగ్‌ అదిరిపోయింది. టీజర్‌ చూస్తుంటే కంప్లీట్‌ పవర్‌ ఫ్యాక్డ్‌ సినిమాలా కనిపిస్తోంది. నవ్వించడం, భయపెట్టడంతో పాటు ఏదో ఓ కొత్త కాన్సెప్ట్‌ను ‘రాకాస’లో పరిచయం చేయబోతోన్నట్టుగానే కనిపిస్తోంది. టీజర్‌తో ఒక్కసారిగా అంచనాల్ని అమాంతం పెంచేసినట్టు అయింది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్‌ విద్యార్థి, గెటప్‌ శ్రీను, సుక్విందర్‌ సింగ్‌, అన్నపూర్ణ, అమన్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌, రమణ భార్గవ్‌, వాసు ఇంటూరి, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, దర్శకత్వం: మానస శర్మ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మన్యం రమేష్‌, సంగీతం: అనుదీప్‌ దేవ్‌, సినిమాటోగ్రాఫర్‌: రాజు ఎదురోలు, ఎడిటర్‌: అన్వర్‌ అలీ , ప్రొడక్షన్‌ డిజైనర్‌: రామాంజనేయులు, ఆర్ట్‌ డైరెక్టర్‌: పుల్ల విష్ణు వర్ధన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -