Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తండ్రి గెలుపు కోసం అమెరికా నుంచి వచ్చి తనయుడి ప్రచారం

తండ్రి గెలుపు కోసం అమెరికా నుంచి వచ్చి తనయుడి ప్రచారం

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.మండల పరిధిలోని అన్నారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుంచాల శ్రీనివాస్ రెడ్డి కుమారుడు కుంచాల శ్యాం ప్రసాద్ రెడ్డి ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన తండ్రి శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేయడానికి స్వగ్రామానికి వచ్చి ఇంటింటికి తిరుగుతూ తన తండ్రిని గెలిపించాలని కోరారు.తన తండ్రిని గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెబుతున్నాడు. తన తండ్రిని గెలిపించినట్లయితే గ్రామంలో గ్రంథాలయం విద్యాభివృద్ధికి డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. గ్రామంలోని ప్రజల సౌకర్యార్థం అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తన తండ్రి యొక్క కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకున్నారు. శ్యాం ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ విజయయాత్రను తలపించేలా ఉందని గ్రామ ప్రజలు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -