Tuesday, December 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళకళలాడుతున్న కంది పంట..

కళకళలాడుతున్న కంది పంట..

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
మండలంలోని కంది పంట కళకళలాడుతోంది. కొన్ని ప్రాంతాలలో భారీగా పూత రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని గ్రామాలలో కంది మొక్కలు ఎపూగా పెరిగిన , కాతా,  పూత సరిగా లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. వ్యవసాయ అధికారులు లెక్కల ప్రకారం మండలంలోని 39వేల ఎకరాలలో పంటకు అనుకూలంగా భూములు ఉన్నాయి. అందులో వివిధ రకాలైన పంటలలో అంతర పంటగా కందిని జుక్కల్ ప్రాంత రైతులు కంది అంట పండిస్తూన్నారు.  ఈ సాంప్రదాయాన్ని ప్రస్తుతం రైతులప కూడా కొనసాగీస్తున్నారు.

రైతులు ఇప్పటికే భారీగా వ్యవసాయ భూములలో కంది పండిస్తున్న రైతులు వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడిని  పెట్టారు. కొన్ని కొన్ని గ్రామాలలో ఇప్పటికే కంది పంటలు ఏపుగా పెరిగినప్పటికీ పూత, కాతా లేకపోవడంతో రైతులు పెట్టుబడి కూడా వస్తుందో రాదో అని దిగాలు పడుతున్నారు. ఇంకా కొన్ని గ్రామాలలో భారీగా ఖాతా,  పూత రావడంతో  రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ మండలంలో రెండు రకాలుగా పంటలు ఉండడంతో కొంతమంది సంతోషంగా ఉన్న ఇంకొంతమంది రైతులు పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు వేలాది రూపాయల రసాయన ఎరువులు వాడినప్పటికీ ఎటువంటి ఫలితం రాలేదని మండల రైతులు అంటున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -