Friday, July 4, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిశైవానికి మూలాధారం - బౌద్ధమే !

శైవానికి మూలాధారం – బౌద్ధమే !

- Advertisement -

‘ఏసధమ్మో సనన్తనో అన్నది బుద్ధుని మాట! సనాతన – అనే పదం బౌద్ధం నుండి వైదికులు దొంగిలించుకున్న పదం- పాకిత్‌ భాషలో బుద్ధుడి అసలు పేరు గోతమ, సిద్ధత్త- సంస్కత భాషా ప్రభావంతో పాకీత్‌ భాష ప్రాకతమైంది. గోతమ – గౌతమ అయ్యింది. సిద్ధత్త సిద్ధార్థ అయ్యింది. ఈ ఆధునిక కాలంలో బతుకుతున్న మనకు పాకిత్‌ భాష తెలియదు. పరిచయం లేదు. ఇంతో అంతో సంస్కృత పదాలతో పరిచయం ఉంది గనుక, మనం గౌతముడనీ, సిద్ధార్థుడనీ అంటున్నాం. అప్పటి పాకిత్‌ను ప్రాకృతమనీ, పాలి భాషను పాళీ అని వ్యవహరిస్తున్నాం. ఇక్కడ ఉచ్ఛారణ కన్నా జరిగిన మోసాల గురించి తెలుసుకోవడం ముఖ్యం – బుద్ధుడికి జ్ఞానోదయ మైందన్న దానికి గుర్తుగా బౌద్ధ శిల్పులు బుద్ధ విగ్రహానికి నుదుటి మీద నిలువుగా ఒక కన్నును చెక్కుకున్నారు. మామూలు కళ్లతో చూడ లేనిది ఆయన తన జ్ఞాన నేత్రంతో చూశాడని వారు అభిప్రాయ పడ్డారు.

దాన్ని కాపీ కొట్టి రుద్రుడి మూడో కన్ను (శివుడి మూడో కన్ను)గా వైదికులు కథలల్లారు. బౌద్ధుల జ్ఞాన ప్రతీక – వైదికుల విస్ఫోటక ప్రతీక- అయ్యింది. ధ్యాన ముద్రలో ఉన్న కొన్ని శిల్పాలు కిరీటాలతో కనిపిస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే, ఆ కిరీటాల మీద ధ్యాన ముద్రలో ఉన్న చిన్న చిన్న బుద్ధుడి రూపాలు కనిపిస్తాయి. అవి శివుడి విగ్రహాలే అయితే మరి అక్కడ బుద్ధుడి రూపాలేందుకున్నాయీ ? అనే ప్రశ్న వస్తుంది. కట్టు కథలు గనక, ఎలాగైనా రాసుకోవచ్చునన్నది తేలిపోయింది.
అశోక చక్రవర్తి పలు ప్రాంతాల్లో బౌద్ధ ధమ్మాన్ని ప్రచారం చేయడం కోసం అర్హతులైన (అర్హులైన) భిక్షులను, మహాస్థవిరులను నియమించాడు.

అలాంటి వారిలో మహాదేవ్‌ మహాస్థవీర భిక్షవు ఒకరు. ఈయన పర్వత శ్రేణుల్లో నివసించేవాడు. ఈయన్ను దష్టిలో పెట్టుకుని, వైదిక మతస్థులు హరహర మహదేవ్‌ను- అంటే శివుణ్ణి సష్టించుకున్నారు. బౌద్ధులు నాగజాతి వారు. బౌద్ధాన్ని రక్షించిన జాతి కూడా ఈ నాగ జాతి ప్రజలే. ఈ నాగులు బౌద్ధ ధమ్మ రక్షకులు, గొప్ప ప్రచారకులు అని చెప్పడానికి ప్రతీకగా బుద్ధుని చిత్రాన్ని కొన్నిచోట్ల సర్పంలా గీశారు (చెక్కారు) అంతేకాదు, బుద్ధుడికి రక్షణనిస్తున్నట్లు నాగుపాము పడగ నీడలో బుద్ధుడు, సమాధిలో కూర్చునట్లు.. శిల్పాలు చెక్కుకున్నారు. బౌద్ధ శిల్పాల్లో మనకు ఇలాంటివి చాలాచోట్ల కనిపిస్తున్నాయి. నాగుపాము మెడలో ధరించి, పర్వతాలలో సంచరించే మహా దేవుణ్ణి అంటే శివుణ్ణి – బుద్ధుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని వైదికులు రూపొందించుకున్నారు. బౌద్ధాన్ని కాపీ చేసి ఒక్కొక్కటి స్వంతం చేసుకున్నట్లుగానే, మహదేవుడు – ఈశ్వరుడు – శివుడు అని పిలవబడే హిందూ దేవుడికి మూలం బౌద్ధమే!


పురాణాల్లో మహదేవుడు జటాధారిగా వర్ణించబడ్డాడు. అందుకు కారణం- సారనాథ్‌లో ఉన్న బుద్ధుడి విగ్రహం జటాధారిగా ఉంది. అంటే నిజమైన జటాధారి ఆ బుద్ధుడే అని తెలుస్తూ ఉంది కదా? శివుడిలాగా బుద్ధుడు కల్పిత పాత్ర కాదు. ఇకపోతే బౌద్ధంలో అరహతులైన వారిని ఉన్నత స్థాయికి చేరుకున్న గొప్ప భిక్షువులను ‘దేవా’ అని సంభోదిస్తారు. ఇది పాలి భాషా పదం. అందుకే వారు బుద్ధుణ్ణి ‘బుద్ధదేవా’- అని పిలుచుకున్నారు. బుద్ధుడు శాక్య గణానికి చెందిన భారతీయ మూలవాసి. విదేశీ ఆర్యుడు కాడు.
చరిత్ర నుండి లభించిన ఈ వాస్తవాలు తెలుసుకున్న తర్వాత కూడా, వాటిని పక్కన పెట్టి, వైదిక మత పెద్దలు ఊహల్లో కల్పించుకున్న ఆ శివుడినే నమ్ముతాం – అని ఎవరైనా అంటే, అది వారి ఇష్టం! ఆధారాలు లేని పురాణ పాత్రల మీద మాకు నమ్మకం ఉందీ – అని అనే వారితో మనకు వాదన లేదు. నిజాలు తెలుసుకోవాలి. నిజంలో బతకాలి అని తపించే వారి కోసమే ఈ సమాచారం – కొంత మందైనా సరే, ఈ క్షణంలో ఆలోచించే సత్యాన్వేషకులు ఉంటారు కదా? పైగా భారత రాజ్యాంగం ప్రకారం వైజ్ఞానిక స్పహను నిలుపు కోవడం అవుతుంది.


బోధిసత్వ అవలోకి తేశ్వరుణ్ణి – శివుడిగా మార్చుకున్నారు. బోధిసత్యతారను-పార్వతిగా మార్చుకున్నారు.థేరగాథల్ని శ్రావ్యంగా పాడగలిగే బౌద్ధభిక్షుణి సురసతిని మార్చి, సరస్వతి – చదువుల తల్లిగా చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బౌద్ధ శిల్పాల రూపురేఖలు మార్చి, హిందూ దేవీ దేవతలుగా మార్చుకుని – అర్చనలు, పూజలు పేరుతో పురోహిత వర్గం తమ జీవనాధారం చూసుకున్నారు. ధైర్యం ఉంటే- ఆ దేవీ దేవతల మేకప్‌లు, ఆభరణాలు, అతికించి పెట్టిన శరీర భాగాలు తొలగించి, ఉన్నవి ఉన్నట్లుగా దేశ ప్రజల ముందు పెట్టే సాహసం చేయగలరా? బ్రాహ్మణార్యులు బౌద్ధ గుహల్ని, చిహ్నాల్ని శిల్పాల్ని బౌద్ధ సాహిత్యాన్ని దొంగిలించి బ్రాహ్మణ మతానికి రూపకల్పన చేసుకున్నారు. అంతా కాపీ పేస్ట్‌ వ్యవహారమని అన్నింటికి అన్నీ ఆధారాలు అందుబాటులో కొచ్చాయి. చివరకు బుద్ధుణ్ణే తమ దశావతారాల్లో చేర్చుకున్న విషయం మనకు తెలిసిందే. వైదిక మతంలోని దశావతారాల్లో చేర్చుకున్నారు. గానీ, బుద్ధ విగ్రహాలు కనిపించిన చోట పూజలెందుకు చేయడం లేదు. పూజలు అక్కర లేదు.

కనీసం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి కదా? బౌద్ధ శిల్పాలు, బౌద్ధ శిథిలాలు బయట పడ్డ చోట వైదికులు వెళ్లి తమ భక్తి శ్రద్ధలు ప్రకటించుకోరెందుకూ? ఓ ముస్లింను సాయిబాబాలా మార్చుకుని, కిరీటాలు పెట్టి, గుళ్లు కట్టి, పురోహిత వర్షమంతా అక్కడ వాలిపోయి పూజలు చేస్తున్నారు కదా? దశావతారాల్లో ఒక అవతారం అని చెప్పుకుంటూ అతణ్ణి, అతడి ఆరామాల్ని కొల్లగొట్టడమెందుకూ? ఇందులో ఏమైనా నిజాయితీ ఉందా? చెప్పుకునే దానికీ చేసే దానికీ పొంతన ఉందా? బుద్ధుడు తమ వాడు- అని చెప్పుకుంటూనే, నామ రూపాలు లేకుండా నాశనం చేయడానికి వైదిక మతస్థులు శతాబ్దాలుగా కుట్రలు చేస్తూ వచ్చారన్నది స్పష్టంగా తెలుస్తోంది! ప్రతి పండగ, నిత్యజీవితంలోని ప్రతి సంప్రదాయం బౌద్ధాన్ని మార్చుకుంటూ ఏర్పాటు చేసుకున్నదే అని పరిశోధకుడు శశిధర్‌ వలతటి చెపుతున్నాడు. బౌద్ధ స్థూపాలు – బుద్ధుని ధ్యాన చిహ్నాలు బుద్ధుడు కాళ్లు ముడుచుకుని కూర్చోవడానికి ప్రతీకగా స్థూపానికున్న అడుగు. కింది భాగాన్ని రూపొందించారు. గుండ్రంగా స్తంభంలాగా ఉన్న స్థూపం – ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడికి ప్రతీక! బుద్ధుడి తల, తల పై నున్న వెంట్రుకలు, వెంట్రుకల ముడి – స్థూపం మీద గుండ్రటి భాగం – దాని మీద మరింత చిన్నగా ఉన్న భాగాలు… ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుణ్ణి దష్టిలో ఉంచుకుని, బౌద్ధ స్థూపాలకు రూపకల్పన చేశారు. అంటే, డిజైన్‌ చేశారు. అని అర్థమవుతూ ఉంది.


బుద్ధుడు మహా పరినిర్వాణం పొందే ముందు కొందరు భిక్కులు, బుద్ధుణ్ణి ఆడిగారు. భగవాన్‌! మీ తరువాత మమ్మల్ని నడిపించే నాయకుడు ఎవరు? – అని! అప్పుడు బుద్ధుడు చెప్పాడు- ”అత్త దీపా! అత్త సరణో! అనణ్ణ సరణో” అని అన్నాడు. అంటే మీకు మీరే దీపాలు కండి. మీకు మీరే శరణుకండి. ఇతరులెవరూ మీకు శరణు కారు ” అని అర్థం. ఇలా మీకు మీరే దీపం కండి. మిమ్మల్ని మీరే నడిపించుకోండి- అని చెప్పిన తాత్వికుడు – జ్ఞాని- ప్రబోధకుడు – ప్రపంచంలో మరొకరెవరూ ఎప్పుడూ ఎక్కడా లేరు. అందుకే ఈ రోజు, బౌద్ధ సంఘం లేని దేశం ప్రపంచంలో లేదు.


చనిపోయిన మనిషిలో నాలుగు ధాతువులుంటాయని, బౌద్ధం చెపుతుంది. అవి గాలి, వేడి (ఊష్ణం) చర్మం (మట్టి) నీరు. ఇవన్నీ నేలలో కలిసిపోతాయి. మళ్లీ ఇవి సజీవ రూపం దాల్చడం జరగదు. అంటే మళ్లీ జన్మ ఉండదు. ఆత్మలు ఉండవు. (ఆత్మ బంటాయని అనుకుంటే, అన్ని జీవరాసులకూ ఆత్మలుంటాయని అనుకోవాలి) ఒక్క మనిషికే ఎందుకు? ఆత్మ అనేది ఉండదని బౌద్ధం బలంగా చెప్పింది. అయితే, మనసు నిలువ చేసుకున్న జ్ఞాపకాలు (అనుభవాలు) జ్ఞానంగా మిగిలిపోతాయి. ప్రతి జ్ఞాపకమూ (అనుభవమూ) జ్ఞానం కాకపోవచ్చు. కానీ, జ్ఞాపకాల్ని ఇతరులతో పంచుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇలా ఒక తరం నుండి మరో తరానికి అందే జ్ఞానాన్నే బౌద్ధం పునరుజ్జీవనం – అని అంటుంది. ఇతర మతాలు దీన్నే ‘ఆత్మ అని అన్నారు. ప్రపంచంలోనే తొలి హేతువాది అయిన బుద్ధుడి ఉనికిని నాశనం చేయడానికి వైదిక మతస్థులు చేయని దురాగతాలు లేవు.

వజ్రకరణలు లేవు. ఎన్నీ చేసినా, నిజాన్ని నాశనం చేయలేరన్నట్లుగా బౌద్ధం భూమి పొరల్లోంచి బయటపడి, వైదికుల జ్ఞానానికి సవాలుగా నిలబడుతూనే ఉంది. తనను నాశనం చేసిన వారి సంతతిని ప్రేమగా బుద్ధుడు ఏదో రకంగా స్పశిస్తూనే ఉన్నాడు. అందుకే చూడండి, ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఓ చోట, బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ దొరుకుతూనే ఉన్నాయి. ఇటీవల ఇటలీలోని భూమిని తవ్వుతుండగా ఎన్నో బౌద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. అక్కడి సియన్నా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జాకాపీతబోలి ఆ తవ్వకానికి నాయకత్వం వహిస్తున్నారు. మా గ్రీకు దేవుడు – బుద్ధుడు – అని వారు ప్రకటించుకున్నారు. ఆ విగ్రహ ఛాయా చిత్రాల్ని వారు ప్రపంచ మీడియాకు అందించారు. ఆ రకంగా విషయం ప్రపంచవ్యాప్తమైంది. గౌతమ బుద్ధుడి తొలి విగ్రహం బౌద్ధ చక్రవర్తి కనిష్కుడి కాలంలో అక్కడికి చేరినట్లు చెపుతున్నారు. దీనివల్ల తెలిసేదేమంటే, ప్రపంచ దేశాల్లో బౌద్ధం గురించిన పరిశీలనలు, పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
ఒకప్పుడు శిల్పాలు మాత్రమే ఉండేవి. తర్వాత కాలంలో చిత్రాలు వాడుకలోకి వచ్చాయి.

ఫొటోగ్రఫీ రాకముందు చిత్రకారులు చిత్రాలు గీస్తుండేవారు. మనకిప్పుడు ప్రపంచ వాప్తమై పోయిన వైదిక దేవీ దేవతల చిత్రాలకు ఎవరు రూపకల్పన చేశారూ? – అన్న దానికి చారిత్రక ఆధారం దొరికిం ది. 18వ శతాబ్దంలో ఒరోడాలోని ఆస్మాన చిత్రకారుడు నరేశ్‌ సయాజీరావు గైక్వాడ్‌, బౌద్ధ శిల్పాలను చూస్తూ శివుడు, విష్ణు, సరస్వతి, దుర్గ, గణపతి వంటి హిందూ దేవతల రూపు రేఖల్ని నిర్దారించాడు. ఆయనే కాదు, మన దక్షిణ భారత చిత్రకారుడు రవివర్మ కూడా బుద్ధ శిల్పాల ఆధారంగానే హిందూ దేవతల రూపురేఖలు గీస్తూ, అందుకు ఆయన సజనాత్మకత కూడా జోడించడంతో ఆ చిత్రలేఖనాలు ప్రఖ్యాతి గాంచాయి. అయితే ఈ చిత్రకారుల చిత్ర లేఖనాల గురించి మనువాదులు ఒక పెద్ద అబద్ధం ప్రచారం చేశారు. ఆ చిత్రాలు మనకు అనాది కాలంగా అందుతున్న సంపద అనీ వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ అని ఊదరగొట్టారు. ఇంతెందుకూ? ఇటీవల కట్టిన అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం జాగ్రత్తగా గమ నిస్తే, బుద్దుడి పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి.


ఇకపోతే, అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. సనాతనం – అన్నది బుద్ధుడి మాట! నహి వేరేన వేరని, సమ్మన్తీధ కుదాచనం! అ వేరేనా సమ్మన్తి’, ‘ఏ సధమ్మో సనన్తనో ”” అంటే, ప్రపంచంలో ద్వేష భావనలు, ద్వేష రహితం గా ఉండడం వల్ల మాత్రమే నశిస్తాయి-ఇదే సనాతన ధర్మం! సమకాలీనంలో మన దేశ కాల పరిస్థితులకు ఈ బుద్ధుడి మాట సరిగా సరిపోతుంది. సనాతనం అంటే ఏమిటో తెలుసుకో కుండా, దాని గూర్చి ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. అది వారి అజ్ఞానం! మనం మాత్రం జ్ఞానమార్గాన్నే ఎంచుకుందాం.
– కవిరాజు త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలిగ్రహీత
డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -