– పార్టీ మారిన ఎమ్మెల్యేలకు శిక్ష తప్పదు : ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన వ్యవహారంపై దాఖలైన ఫిర్యాదును స్పీకర్ డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధమని, స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం స్పీకర్‌కు కనిపించకపోవడం విచారకరమన్నారు. పార్టీ పిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని సభలకు, కార్యక్రమాలకు హాజరవుతున్న దృశ్యాలు అందరికీ కనిపిస్తున్నాయన్నారు. అయినా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధమేనన్నారు. స్పీకర్ ఆత్మసాక్షిగా, చట్టపరంగా నిర్ణయం తీసుకోలేక పోతున్నారని, ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ చర్యలకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. ఆ ఎమ్మెల్యేలను స్పీకర్ వదిలినా కోర్టులు వదిలిపెట్టవని హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు న్యాయపరంగా శిక్ష తప్పదని, డిస్‌క్వాలిఫై చేయడం ఖాయమని స్పష్టం చేశారు.
స్పీకర్ న్యాయబద్ధంగా పనిచేయడం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



