Saturday, August 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్పీకర్‌ అనర్హత వేటు వేయాలి

స్పీకర్‌ అనర్హత వేటు వేయాలి

- Advertisement -

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే
రాహుల్‌ గాంధీ స్పందించాలి
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
స్పీకర్‌ అనర్హత వేటు వేయాలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోర్టులను తప్పుదోవ పట్టించాలన్న కాంగ్రెస్‌ కుట్రలను ఎదుర్కొని అంతిమంగా సత్యమే గెలిచిందన్నారు. గౌరవప్రద స్పీకర్‌ పదవిని అడ్డం పెట్టుకుని రాజ్యాంగ వ్యతిరేక ఫిరాయింపుల రాజకీయానికి సుప్రీం తీర్పు చెంపదెబ్బ లాంటిదని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ తన నిజాయితీ, నిబద్ధతను నిరూపించుకోవాలని సూచించారు. పార్టీ మారితే అనర్హత వర్తించాలని పాంచ్‌ న్యారు సూత్రాన్ని వల్లె వేస్తున్న రాహుల్‌ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రానికో నీతి సూత్రం కాంగ్రెస్‌ భవిష్యత్‌ రాజకీయాలకు సరికాదనీ, ఆ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం తీర్పుతో రానున్న మూడు నెలల్లో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్నామని చెప్పారు. ఉప ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -