డిసిఓ వాల్య నాయక్
నవతెలంగాణ – మల్హర్ రావు: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచాలని సహకార సంఘం జిల్లా డిసిఓ వాల్య నాయక్ కొనుగోలు కేంద్రాల ఇంఛార్జ్ లను ఆదేశించారు.గురువారం ఆయన తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య తో కలిసి మండలంలోని తాడిచెర్ల, మల్లారం,ఎడ్లపల్లి, కొండంపేట,కొయ్యుర్ పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో కొనుగోలుకు సంబంధించి ముఖాముఖి మాట్లాడారు.కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లను ట్యాబ్ ఎంట్రీలను తక్షణమే పూర్తి చేయాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.ధాన్యం విక్రయించిన రైతులకు వారం రోజుల్లో డబ్బులు పడేలా చూడాలన్నారు.రైతులు ధాన్యం విక్రయించిన వెంటనే ట్రక్ సిట్ ఇవ్వాలన్నారు.అకాల వర్షాలు వస్తున్నాయని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువ లేకుండా తక్షణమే కేటాయించిన బిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు.కొనుగోలు ప్రక్రియలో తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు గురిచేద్దని ఆయన సూచించారు. అకాల వర్షాలు వస్తున్నందున కొలుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు సిద్ధంగా ఉంచాలని ఆయన తెలిపారు. కొనుగోలు జరిగిన తదుపరి రైతులకు బాధ్యత లేదని కొనుగోలు కేంద్రాలు ఇన్ చార్జీలు పూర్తి బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.
కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES