నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని గత మూడు రోజులుగా ఏడాతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గాంధారి, సర్వపూర్ సెక్షన్ పరిధిలో గల గ్రామాలలో వాగులు చెరువులు పొంగి కట్టలు తెగాయి. చాలా వరకు అటు ప్రజలను ఇటు విధ్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిలింది. 200 విద్యుత్ స్థంబాలు నెలకొరిగాయి. 40 వరకు విద్యుత్ నియంత్రికలు నీటమునిగాయి. ఎల్లారెడ్డి డి ఈ వై. విజయ సారధి లింగంపేట్ సబ్ డివిజన్ ఏడిఈ చికోటి మల్లేశం పర్యవేక్షణలో విద్యుత్ సిబ్బంది ఎక్కడి వారు అక్కడే వినాయక పండకు దూరంగా వుండి, లోతట్టు ప్రాంతాలు విద్యుత్ స్థంబాలు విరిగిన ప్రాంతాలను గుర్తించారు. ఈ క్రమంలో ఈ భారీ వర్షంలో వారి ప్రాణాలకు తెగించి, వాటిని తొలగించి, ప్రతి పల్లెకు, ప్రతి తండాకు కరెంటు అందించారు. ప్రతి ఒక్క ఉద్యోగి రాత్రి రెండు మూడు గంటల వరకు కష్టపడి ప్రతి వినియోగదరునికి కరెంట్ ఇవ్వడం జరిగింది. కొన్ని స్థంబాలను అప్పటికప్పుడు ఏఅరెక్షన్ చేసి సప్లై ఇవ్వడం జరిగింది. విధ్యుత్ శాఖ వారి సేవలకు ప్రజలు ధన్యవాదాలు తెలియచేసారు. విపత్కర పరిస్థితులో ఏ ఈ సాయినాథ్, ఏ ఈ లక్షమయ్య, ఎస్ ఎల్ ఐ రాజి రెడ్డి, లైనమన్ లు కొండల్ రెడ్డి, వాహిద్, మోతిలాల్, తిరుపతిరెడ్డి, మౌలానా, హుందా శ్రీనివాస్, స్వామి గౌడ్,, స్వామి, అధిరెడ్డి, ప్రసాద్ గౌడ్, కుమార్, సంతోష్ నాయక్ లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.
ప్రాణాలను పణంగా పెట్టి పల్లెలకు విధ్యుత్ ను అందించిన సిబ్బంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES