Sunday, October 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీసీల న్యాయ‌మైన వాటా కోసం రాష్ట్ర బంద్‌ను విజ‌య‌వంతం చేయాలి

బీసీల న్యాయ‌మైన వాటా కోసం రాష్ట్ర బంద్‌ను విజ‌య‌వంతం చేయాలి

- Advertisement -
  • బీసీ శ్రేణులకు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీసీ రిజర్వేషన్ల న్యాయమైన వాటా కోసం రేపు బీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు.బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణలను కల్పించడానికి, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లను రక్షించుకోవడానికి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రేపు 18వ తేదీన చేపట్టిన బంద్ కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సిపిఎం టీజేఎస్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతోపాటు సామాజిక ఉద్యమ శక్తులైన ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఆదివాసి, గిరిజన, మైనార్టీ సంఘాలతో పాటు అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని తెలియ‌జేశారు. బీసీ శ్రేణులు ప్రగతిశీల శక్తులను సమన్వయం చేసుకొని శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా బందులో క్రియాశీల పాత్ర పోషించాలని ఓ ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -