మాజీ ఎంపీపీ తోకల వెంకన్న
నవతెలంగాణ – చండూరు
గత పది ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ ఎంపీపీ తోకల వెంకన్న అన్నారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను చండూరు మున్సిపల్ పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ తో, శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి మాజీ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహానేత కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే నుంచి కేంద్ర, రాష్ట్ర మంత్రిగా, తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారని తెలిపారు. బీఆర్ఎస్ ను స్థాపించి బంగారు తెలంగాణ దిశగా అడుగు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తెలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, సామ సుజాత యాదవ రెడ్డి, కొండ్రెడ్డి మధు, పార్టీ నేతలు అన్నపూర్తి శేఖర్, తేలు కుంట్ల జానయ్య , పెద్దగోని వెంకన్న, గండూరి జనార్దన్, చొప్పరి దశరథ, జోరిగాల వెంకన్న, రావుల రవి, పెండ్యాల గీత, భూతరాజు వెంకన్న, గిరి, దామెర రాములు, తదితరులు పాల్గొన్నారు.



