– కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య
– కస్తూర్బా విద్యాలయంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.15 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.15 లక్షలతో విద్యార్థినుల సౌకర్యార్థం టాయిలెట్ల నిర్మాణం, పాఠశాల ఆవరణలో సిసి ఫ్లోరింగ్, డైనింగ్ హాల్ నిర్మాణం పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. గతంలో విద్యార్థులకు మెస్ చార్జీలు రూ.50 ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రూ.200 కు పెంచిందని తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలకు పుస్తకాల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవడం గొప్ప విషయం అన్నారు.
అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పలు అభివృద్ధి పనులకు సీడీపీ నిధుల నుండి రూ.15 లక్షలు మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ముత్యాల సునీల్ రెడ్డికి పాఠశాల యాజమాన్యం తరపున కమ్మర్ పల్లి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మండల పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సల్లూరి గణేష్, మాజీ ఎంపీటీసీ గుడిసె అంజమ్మ, నాయకులు బుచ్చి మల్లయ్య, వేముల గంగారెడ్డి, బోనగిరి లక్ష్మణ్, దూలురి కిషన్, పాలెపు రాజేశ్వర్, రంజిత్, శైలేందర్, నాగరాజ్, జగదీష్, దీపక్, రమణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



