Tuesday, March 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు సాధించాలి

రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు సాధించాలి

- Advertisement -

గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి బాట : పీఆర్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలపై జరిగిన సమీక్షలో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మార్చి 2026 (ఆర్థిక సంవత్సరం) ముగిసేలోపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పూర్తి స్థాయిలో తెచ్చుకోవాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ వినియోగం, వచ్చే ఏడాది బడ్జెట్‌ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. విభాగాల వారీగా అధికారులు బడ్జెట్‌ ప్రతిపాదనలు మంత్రికి సమర్పించగా, వాటిలో పలు మార్పులు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా కేంద్ర నిధులు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయనీ, ఒక్క రూపాయి కూడా లాప్స్‌ కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధుల కోసం అవసరమైన యుటిలిటీ సర్టిఫికేట్లు సమర్పించి వాటిని త్వరగా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధీ హమీ పథకం స్థానంలో కేంద్రం ప్రవేశ పెట్టిన వీబీజీ ఆర్‌ఏఏఎంజీ చట్టానికి సంబంధించి ఇంకా రూల్స్‌ ఫ్రేమ్‌ కాలేదనీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధీ కల్పన కోసం బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

జిల్లాల వారీగా నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్‌ 2) నాటికి ఈ భవనాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివాసీ, ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో అనేక వాగులు ఉన్నప్పటికీ వేసవికాలంలో సాగు, తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. వాటర్‌షెడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా వాగులు, వంకలు, తోగులపై చెక్‌ డ్యాంల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -