Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వచ్ఛంద సేవలో రాష్ట్రంలో ముందుండాలి: కలెక్టర్

స్వచ్ఛంద సేవలో రాష్ట్రంలో ముందుండాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
గ్రామీణ ప్రజలకు స్వచ్ఛంద సేవలు అందించడంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ రాష్ట్రంలోనే ముందుండాలని నూతన జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా రెడ్క్రాస్ బృందం నూతన కలెక్టర్ ను కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెడ్ క్రాస్ నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమాలలో తను భాగస్వామ్యం అవుతానని  తెలిపారు.

త్వరలో నిర్వహించనున్న రెడ్క్రాస్ జిల్లా సర్వసభ్య సమావేశంలోనూ తను పాల్గొంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీనరసింహారెడ్డి, వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్ మహేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు సద్ది వెంకటరెడ్డి, జిల్లా డైరెక్టర్లు ,జంపాల అంజయ్య, ఎస్.ఎన్. చారి, డివిజన్ ప్రతినిధులు చంద్రశేఖర్, లావణ్య, యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు బి సుమచ్చగిరి,కార్యాలయ కార్యదర్శి క్రిస్టోఫర్,  ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -