శివుని చెంత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి దంపతుల పూజలు
నవతెలంగాణ -ఖమ్మం
మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విరాజిల్లాలని, తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుడిని వేడుకున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురంలో మల్లిఖార్జున స్వామి దేవాలయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి, దేవాలయ కమిటీ పాలకవర్గం మల్లు భట్టి విక్రమార్కు దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికినారు. అనంతరం జాతరలోని పలు దుకాణాలను సందర్శించి నిర్వాహకులతో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడింగ్ల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను మంత్రి పొంగులేటి, మాధురి దంపతులు తమ మనుమరాలు మైరాతో కలిసి ఆదివారం సందర్శించారు. తొలుత పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్ మండలం తీర్థాల శ్రీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. త్రివేణి సంగమ క్షేత్రంలో వెలసిన స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చారిత్రక ప్రసిద్ధి గాంచిన కూసుమంచి శ్రీ గణపేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. కాకతీయుల శిల్పకళా వైభవానికి నిలువుటద్దంగా నిలిచే ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. పర్యటనలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం బెండాలపాడులోని పల్లెర్లబావి శ్రీ వీరభద్రస్వామిని సందర్శించారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



