Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

- Advertisement -

రెండేండ్ల పాలనచూసి ప్రజలు కాంగ్రెస్‌ వెంట ఉన్నారు : సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను అస్తవ్యస్తం చేసిందని రాష్ట్ర సంక్షేమ శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడ లేని విదంగా కట్టామని చెప్పిన కాళేశ్వరం ద్వారా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ఒక్కచుక్క నీరు ఇవ్వలేదని అన్నారు. ప్రాజెక్ట్‌లో చేసిన అవినీతికి ఇతర దేశాల్లో అయితే కఠిన శిక్షలు విధించే వారని గర్తు చేశారు.

బీఆర్‌ఎస్‌ చేసిన తప్పుడు పనుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.6వేల కోట్లు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కు చేసిన అప్పులో ఇప్పటి వరకు రూ.47 వేల కోట్లు చెల్లించాలమని అడ్లూరి తెలిపారు. రెండేండ్ల కాంగ్రెస్‌ ప్రజా పరిపాలనతో ప్రజలు తమ ప్రభుత్వం వెంట ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, మాజీ మంత్రి మోత్కుపల్లి, మీడియా సెల్‌ కన్వినర్‌ సామ రామ్మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -