జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పులి లక్ష్మయ్య
ఇందిరాపార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ – ముషీరాబాద్
రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీ విధానం రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పులి లక్ష్మయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు శాంతియుతంగా మౌన దీక్ష, ఒంటి కాలు ప్రదర్శన, అర్ధనగ ప్రదర్శన, బిక్షాటన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను, వారి కుటుంబాలను ఆర్థికంగా మానసికంగా వేధిస్తున్న ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలతో ప్రభుత్వానికి కానీ, ఉద్యోగికి కానీ ఎటువంటి లాభం లేదని, రాష్ట్ర సంపద ఏజెన్సీ వ్యవస్థకు తరలివెళ్తోందన్నారు. ఏజెన్సీలు ఉద్యోగులపైన పెత్తనం చెలాయిస్తూ ప్రతినెలా ఈపీఎఫ్, ఈఎస్‌ఐ నెలల తరబడి కట్టకుండా సొంతంగా వాడుకోవడంతో చాలామంది ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఉద్యోగులకు ఈపీఎఫ్ ఈఎస్‌ఐ వంటి ప్రయోజనాలు సక్రమంగా లభించడం లేదన్నారు. ఉద్యోగుల ఆత్మహత్యలకు దారి తీస్తున్న ఏజెన్సీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత ఇస్తూ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ ధర్నాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్, శ్రీనివాస్, కోశాధికారి సంతోష్ కుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీ విధానం రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



