Sunday, January 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకుష్టు వ్యాధికన్నా అపఖ్యాతే ఎక్కువ ప్రమాదకరం

కుష్టు వ్యాధికన్నా అపఖ్యాతే ఎక్కువ ప్రమాదకరం

- Advertisement -

ప్రొఫెసర్‌, డాక్టర్‌ భూమేష్‌ కుమార్‌ కటాకం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశాన్ని అనేక వ్యాధులు కుదిపేస్తున్నాయి. జబ్బుకన్నా ఎక్కువగా అపోహలే ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఈ పరిస్థితి మరీ ఎక్కువైంది. చిన్నచిన్న కారణాలకే ప్రజలు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కానీ, వ్యాధికన్నా మనిషిలో భయమే దానికి కారణం. అందుకే వ్యాధి వచ్చిన వారు డాక్టర్లను సంప్రదిస్తే అనేక విషయాలు చెబుతారు. చాలామంది వైద్యులు సమాజంలో వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు.వ్యాధుల నివారణకు దినోత్సవాలు నిర్వహిస్తున్నది. ఇదంతా ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలనే సదుద్దేశమే. అయితే కుష్టురోగం అంటే చాలామంది భయపడుతారు. వారిని చులకనగా చూస్తారు. సమాజం నుంచి వెలివేస్తారు. ఇది సరికాదు.

జనవరి 25 కుష్టు దినోత్సవాన్ని పురస్కరించుకుని థీమ్‌ అపఖ్యాతిని (స్టిగ్మా) అంతం చేయడం, గౌరవాన్ని ప్రోత్సహించడం, తొందరగా గుర్తించడం, సమగ్ర ఆరోగ్య సేవలు, శూన్య వైకల్యాల లక్ష్యంగా పెట్టుకుంది. కుష్టురోగంపై ఉన్న అపోహలు, నిజాలు వివరించేందుకు ప్రొఫెసర్‌, డాక్టర్‌ భూమేష్‌ కుమార్‌ కటాకం, ఎండి (డివిఎల్‌), డిసిహెచ్‌, ప్రొఫెసర్‌ అండ్‌ హెచ్‌ఓడి, డర్మటాలజీ, వెనీరియాలజీ అండ్‌ లెప్రసీ ప్రోగ్రాం డైరెక్టర్‌, పీడియాట్రిక్‌ డర్మటాలజీ ట్రైనింగ్‌ సెంటర్‌, ఓస్మానియా మెడికల్‌ కాలేజ్‌ / హాస్పిటల్‌, హైదరాబాద్‌ ‘నవతెలంగాణ’తో మాట్లాడి అనేక విషయాలు వివరించారు. అయన మాటల్లోనే…

కుష్టువ్యాధిపై అపోహలు
కుష్టురోగం చాలా వేగంగా వ్యాపించే వ్యాధి. తాకడం లేదా భోజనం పంచుకోవడంవల్ల కుష్టురోగం వస్తుంది. కుష్టురోగం శాపం లేదా శిక్ష. కుష్టురోగం వల్ల చేతులు, కాళ్లు ఊడిపోతాయి. కుష్టురోగం నయం కాదు.కుష్టురోగులను వేరుచేయాలి. కుష్టురోగం పేదలకే వస్తుంది. పిల్లలకు కుష్టురోగం రాదు. కుష్టురోగం అంటే పుండ్లే వస్తాయి.అన్ని తెల్ల మచ్చలూ కుష్టురోగమే.ఎండిటి వల్ల లెప్రా రియాక్షన్స్‌ వస్తాయి, చికిత్స ఆపాలి.కుష్టురోగులు పెళ్లిచేసుకోరు, పిల్లలు పుట్టరు.

నిజాలు
కుష్టురోగం అత్యంత తక్కువగా వ్యాపించే అంటువ్యాధుల్లో ఒకటి సుమారు తొంభై ఐదు శాతంమందికి సహజ రోగనిరోధకశక్తి ఉంటుంది. దీర్ఘకాలం, సన్నిహితంగా చికిత్సపొందని వ్యక్తితో ఉండినప్పుడే సాధారణంగా వ్యాప్తి అవుతుంది. కుష్టురోగం తాకడం, చేతులు కలపడం, ఆలింగనం, ఆహారం, బట్టలు, పాత్రలు, పరుపులు పంచుకోవడం వ్యాపించదు. చికిత్సపొందని రోగి నుండి దీర్ఘకాలం ముక్కు తుమ్ములు/చీదరల ద్వారా వ్యాప్తి ఉంటుంది. కుష్టురోగం ఒక బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది పాపాలు, శాపం, దైవశిక్షతో సంబంధం లేదు. ఇలాంటి అపోహలు అపఖ్యాతిని పెంచి చికిత్స ఆలస్యం చేస్తాయి. నేరుగా వైకల్యాలు కలిగించదు. వైకల్యాలు ఈ కారణాల వల్ల వస్తాయి. ఆలస్యంగా గుర్తించడం, చికిత్స లేని నాడీ నష్టం, స్పర్శ లేకపోవడం వల్ల పదే పదే గాయాలు తొందరగా చికిత్స చేస్తే వైకల్యాలను పూర్తిగా నివారించవచ్చు. ఇది వందశాతం నయమవుతుంది.

మల్టీ డ్రగ్‌ థెరపీ (ఎండిటి) ద్వారా సురక్షితం ప్రభావవంతం జాతీయ కుష్టురోగ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఇపి) కింద ఉచితం. వారిని వేరుచేయాల్సిన అవసరం లేదు.ఎండిటి ప్రారంభించిన వెంటనే రోగి సంక్రమణ చేయని వ్యక్తిగా మారుతాడు. కుటుంబంతో ఉండవచ్చు పని/పాఠశాలకు వెళ్లవచ్చు సమాజంలో సాధారణ జీవితం గడపవచ్చు. కుష్టురోగం ఎవరికైనా రావచ్చు. ఆర్థిక స్థితితో లింగం, వయస్సుతో సంబంధం లేదు పేదరికం కారణం కాదు. కానీ, గుర్తింపులో ఆలస్యం చేయవచ్చు. పిల్లలకు కూడా కుష్టురోగం రావచ్చు, ముఖ్యంగా ఇంట్లోనే దీర్ఘకాల సన్నిహిత సంబంధం ఉంటే గుర్తించని పెద్దల కేసులు ఉంటే పిల్లలలో కుష్టురోగం కనిపించడం అంటే క్రియాశీల వ్యాప్తి ఉందని సూచన. ప్రారంభదశలో తెల్లగా లేదా ఎర్రగా ఉండే చర్మ మచ్చలు స్పర్శ తెలియకపోవడం, మంట లేదా మొద్దుబారటం, పుండ్లు సాధారణంగా ఆలస్యంగా, నిర్లక్ష్యమైన కేసుల్లో మాత్రమే వస్తాయి.

సంతానోత్పత్తిని ప్రభావితం చేయదు లైంగిక సామర్థ్యాన్ని తగ్గించదు వంశపారంపర్యం కాదు చికిత్స పొందినవారు సాధారణ కుటుంబ జీవితం గడపవచ్చు. అన్ని తెల్ల లేదా లేత రంగు మచ్చలు కుష్టురోగం కావు. విటిలిగో, పిటైరియాసిస్‌ ఆల్బా, ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌, జన్మమచ్చలు వంటి అనేక కారణాలు ఉంటాయి. కుష్టురోగ మచ్చల్లో సాధారణంగా స్పర్శ లేకపోవడం, ఎండగా ఉండటం, మొద్దుబారటం కని పిస్తాయి. వైద్యుడే నిర్ధారణ చేయగలడు. లెప్రా రియాక్షన్స్‌ ఎండిటి వల్లకావు. ఇవి శరీర రోగనిరోధక ప్రతిచర్య వల్ల వస్తాయి. చికిత్సకు ముందు, సమయంలో లేదా తరువాత రావచ్చు ఎండిటి ఎప్పుడూ ఆపకూడదు. వైద్యుల సూచనలతో రియాక్షన్స్‌ను సమర్థంగా చికిత్స చేయవచ్చు.

గుర్తుంచుకోవాల్సినవి
కారణం, మైకోబ్యాక్టేరియం లెప్రాసి, దీర్ఘ ఇన్క్యుబేషన్‌ కాలం (నెలలు-సంవత్సరాలు), ప్రారంభ లక్షణం స్పర్శ లేకపోయే చర్మ మచ్చలు, తొందరగా గుర్తింపు ప్లస్‌ ఎండిటి సమానం వైకల్యం లేకుండా నయం, వ్యాధికంటే అపఖ్యాతే ఎక్కువ ప్రమాదకరం. తొందరగా గుర్తించడం, సకాలంలో చికిత్స – వైకల్యాలు, వివక్షను నివారిస్తాయి. చికిత్సలేని ఎంబి కేసులతో సన్నిహితంగా ఉండే పిల్లలకు ప్రమాదం ఎక్కువ. అయినా, మొత్తం ప్రమాదం తక్కువ (చాలామందికి సహజ రక్షణ ఉంది). కాంటాక్ట్స్‌కు ఒక మోతాదు రిఫాంపిసిన్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గర్భధారణవల్ల వ్యాధి సంక్రమణ పెరగదు. భ్రూణానికి వ్యాధి సంక్రమించదు ఎండిటి సాధారణంగా సురక్షితం – వైద్య పర్యవేక్షణతో కొనసాగించాలి. హెచ్‌ఐవి ఉన్నవారిలో కూడా కుష్టురోగం రావచ్చు. దీనివల్ల కుష్టురోగం సంక్రమణ గణనీయంగా పెరగదు. సాధారణ ఎండిటి ప్రభావవంతమే. రియాక్షన్స్‌పై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. తొందరగా గుర్తించి పూర్తి ఎండిటి తీసు కుంటే ఫలితం అద్భుతం. వైకల్యాలు, వ్యాప్తిని నివారించవచ్చు. చికిత్స ప్రారంభించిన వెంటనే రోగి అంటువ్యాధి కారుడుకాడు. సామాజిక స్వీకారం, అపఖ్యాతి తగ్గింపు అత్యంత అవసరం.చర్మ వైద్యులందరూ కుష్టురోగ నిపుణులే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -