Friday, July 18, 2025
E-PAPER
Homeసినిమామన చుట్టూ జరిగే కథ

మన చుట్టూ జరిగే కథ

- Advertisement -

రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా ప్రజెంట్‌ చేస్తున్న రూరల్‌ కామెడీ చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ‘కేరాఫ్‌ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను రూపొందించిన నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్‌ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్‌ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ ప్రెస్‌మీట్‌ని నిర్వహించిన మేకర్స్‌ ప్రెస్‌ ప్రీమియర్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రీమియర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ‘ఈ సినిమా మీ అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను. ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ఎలా ప్రమోట్‌ చేయాలి?, ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనే సినిమాని చూపించడం బహుశా కొన్నిసార్లు జరుగుతుంది. ఈ సినిమా నేను ఫస్ట్‌ టైం చూసినప్పుడు పాత్రలన్నీ చాలా సజీవంగా కనిపించాయి. అన్ని మనకి తెలిసిన పాత్రలే మన చుట్టూ ఉన్న పాత్రలే అనిపించాయి. డైరెక్టర్‌ ప్రవీణ కార్డియాలజిస్ట్‌. తను ప్రాక్టీస్‌ చేస్తూనే ఈ సినిమా తీశారు. ఒక భిన్న ఆలోచనతోఈ సినిమాని తీయడం జరిగింది. ఇంత మంచి సినిమా ఇచ్చిన ప్రవీణకి థ్యాంక్యూ’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -