Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బహుజనుల బలోపేతమే..రాజ్యాంగానికి రక్ష

బహుజనుల బలోపేతమే..రాజ్యాంగానికి రక్ష

- Advertisement -

-బీఎస్పీ జాతీయ సమన్వయకర్త అతర్ సింగ్ రావు
– రేగులపల్లి వద్ద జాతీయ నాయకులకు బీఎస్పీ శ్రేణుల ఘన స్వాగతం 
నవతెలంగాణ – బెజ్జంకి

బహుజనుల బలోపేతమే..భవిష్యత్తులో రాజ్యాంగానికి రక్షని..కాంగ్రెస్,బీజేపీ పార్టీలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని బీఎస్పీ జాతీయ సమన్వయకర్త,మాజీ ఎమ్మెల్సీ అతర్ సింగ్ రావు సూచించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీఎస్పీ సమీక్షా సమావేశానికి బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలు అతర్ సింగ్ రావు,సురేశ్ ఆర్య, రాష్ట్రాధ్యక్షుడు ఇబ్రమ్ శేఖర్ ముఖ్య అతిథులుగా హజరవుతుండగా శుక్రవారం మండల పరిధిలోని రేగులపల్లి స్టేజీ వద్ద బీఎస్పీ జాతీయ సమన్వయకర్త నిషాని రామచంద్రం స్థానిక బీఎస్పీ శ్రేణులతో కలిసి పుష్పగుచ్చం అందించి శాలువలు కప్పి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎనగందుల వెంకన్న,జోన్ కో ఆర్డినేటర్ మంద బాలయ్య, మానకొండూర్ అసెంబ్లీ ఇంచార్జ్ నిషాని రాజమల్లు, శ్రేణులు జెరిపోతుల సుమలత,మండలాధ్యక్షుడు సావనపెల్లి రాజు,ప్రధాన కార్యదర్శి నిషాని సురేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -