– ఘనంగా నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలు
– పండ్ల పంపిణీ, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి విరాళం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
బడుగుల బలం…నిరుపేదల వరం, నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్ అన్నారు. బుధవారం మండలంలోని ఉప్లూర్ లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల సునీల్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సునీల్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని స్థానిక ప్రసిద్ధ శ్రీ బాల రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణంలో కేక్ కట్ చేసి, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు రూ.4వేలు వారి సంక్షేమనికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగుల బలం, నిరుపేదల వరం, అనునిత్యం బాల్కొండ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సునీల్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని గ్రామపంచాయతీ కార్మికులతో పాటు మహిళా సంఘాల సభ్యులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్, వార్డ్ సభ్యులు సాదుల్లా, రాకేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దం తిరుపతి రెడ్డి, సుంకరి విజయ్ కుమార్, మారుపాక నరేష్, ఆంజనేయులు, రవిరాజ్, తిరుమలేష్, సాదిక్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
బడుగుల బలం..నిరుపేదల వరం సునీల్ కుమార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



