నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: మే 20న జరిగే జాతీయ కార్మిక సమ్మెలో ట్రాన్స్ పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని అల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ AIRTWF-CITU కేంద్ర కమిటి సభ్యులు కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం చౌటుప్పల్ మండలం మల్కాపురంలో ట్రాన్స్ పోర్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మల్కాపురం గ్రామంలోని దేవుని గుడి నుండి ఇండస్ట్రియల్ పార్క్ మీదుగా పారిశ్రామిక ప్రాంతంలో ట్రాక్టర్స్ తో , మినీ గూడ్స్ తో మే 20 సమ్మె జయప్రదం చేయాలని ,లేబర్ కోడ్ లు రద్దు చేయాలని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ట్రాక్టర్ ర్యాలీని ట్రాన్స్ పోర్ట్ యూనియన్ కేంద్ర కమిటి సభ్యులు కల్లూరి మల్లేశం ,యూనియన్ జిల్లా అధ్యక్షులు యండి పాషా గారితో కలిసి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నుండి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలు అమలుచేస్తున్నదని విమర్శించారు.29 కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్నాడని ,కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిఐటియుతో పాటు జాతీయ కార్మిక సంఘాలు , స్వతంత్ర ఫెడరేషన్ లు ,రాష్ట్ర వ్యాపిత కార్మిక సంఘాలు మే20 జాతీయ సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని ఈ సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
10 సంవత్సరాలు జైలు శిక్ష , ఏడు లక్షల జరిమానా ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లకు కఠినంగా శిక్ష విధించే భారత న్యాయ సంహిత సెక్షన్ 106(1)(2) ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.డ్రైవర్ ల లైసెన్స్ లు , వాహన రిజిస్ట్రేషన్ లను సైతం నూతన మోటార్ వాహన చట్టం -2019 ప్రకారం ప్రైవేట్ ఏజెన్సీ లకు ఇస్తారని ,అధిక ఫైన్ లు వేస్తారని డ్రైవర్ లకు నష్టం చేసే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ చట్టం రద్దు అయ్యేవరకు జరగబోయే పోరాటాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని మే 20 సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ట్రాన్స్ పోర్ట్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు యండి పాషా , నాయకులు బత్తుల దాసు,శ్రీనివాస్ రెడ్డి ఎస్డీ ఉమర్,రమేష్,బాలరాజు అందోల్ మాత ట్రాక్టర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ,కార్యదర్శులు స్వామి గౌడ్ , జావీద్,నాయకులు దేవయ్య ,సుంకరి రమేష్ గౌడ్,కృష్ణ,మధుసూదన్ రెడ్డి, లింగస్వామి,శ్రీనివాస్ రెడ్డి,వెంకట్ రెడ్డి, సంజీవరెడ్డి,మీసాల రవి,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మే 20న సమ్మె జయప్రదం చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES